Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
ఫీల్డ్ అసిస్టెంట్లను విధుల్లోకి తీసుకుంటామంటూ అసెంబ్లీ వేదికగా ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించడం మంచి పరిణామమని తెలంగాణ విద్యావాలంటీర్ల సంఘం వ్యవస్థాపక అధ్యక్షులు మఠం శివానందస్వామి తెలిపారు. అదే తరహాలో విద్యావాలంటీర్లనూ విధుల్లోకి తీసుకోవాలని మంగళవారం ఒక ప్రకటనలో కోరారు. కోవిడ్ మహమ్మారి కారణంగా బడులు మూతపడి విద్యావాలంటీర్లను ప్రభుత్వం తొలగించిందని గుర్తు చేశారు. లాక్డౌన్ వల్ల వారు ఆర్థిక సమస్యలతో సతమతమయ్యారనీ, దినసరి కూలీలుగా మారారని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వం సానుకూల నిర్ణయం తీసుకుని న్యాయం చేయాలని కోరారు. ఉపాధ్యాయ నియామకాల్లో విద్యావాలంటీర్లకు పది శాతం వెయిటేజీ కల్పించాలని విజ్ఞప్తి చేశారు.