Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 317 జీవో సమస్యలు పరిష్కరించాలి : ఎస్టీయూటీఎస్
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
రాష్ట్రంలో 317 జీవో వల్ల ఇబ్బంది పడుతున్న ఉపాధ్యాయుల సమస్యలను పరిష్కరించాలని ఎస్టీయూటీఎస్ డిమాండ్ చేసింది. ఈ మేరకు ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షులు జి సదానందంగౌడ్, ప్రధాన కార్యదర్శి ఎం పర్వత్రెడ్డి మంగళవారం ఒక ప్రకటన విడుదల చేశారు. సమస్యలు పరిష్కరించకపోతే ఈనెల 31న పాఠశాల విద్యాశాఖ సంచాలకుల కార్యాలయాన్ని ముట్టడిస్తామని హెచ్చరించారు. 317 జీవో వల్ల కేటాయింపుల్లో తప్పిదాలు, సీనియార్టీలో జరిగిన పొరపాట్లు, ప్రత్యేక కేటగిరీలో చేసిన తప్పులు, కోర్టు ద్వారా వచ్చిన అప్పీళ్లు ఇప్పటికీ పరిష్కరించలేదని విమర్శించారు. ఎప్పటి వరకు పరిష్కారమవుతాయో తెలియడం లేదని వివరించారు. భార్యాభర్తలు, మెడికల్ ఇబ్బందులు, సీనియార్టీ జాబితాలో తప్పులను పరిష్కరించాలనీ, వితంతువులు, ఒంటరి మహిళలకు హైకోర్టు సూచించిన విధంగా అప్పీళ్లను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. మంగళవారం విద్యాశాఖ సంచాలకులు శ్రీదేవసేనను కలిసి ధర్నా నోటీసు అందజేశామని తెలిపారు. ఈనెల 17న ఉపాధ్యాయులు నల్లబ్యాడ్జీలతో విధులకు హాజరవుతారని పేర్కొన్నారు. 24న జిల్లా కలెక్టర్ కార్యాలయాల వద్ద నిరసన చేపట్టాలని నిర్ణయించామని తెలిపారు.