Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 17న ఇందిరాపార్కు వద్ద ధర్నా
- అధ్యక్ష స్థానాన్ని రాజకీయాల కోసం వాడుకోవటం సరిగాదు :బీజేపీ ఎమ్మెల్యేలు రాజాసింగ్, ఈటల, రఘునందన్‌రావు
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
తమను శాసనసభ నుంచి సస్పెండ్ చేసిన స్పీకర్ నిర్ణయంపై సుప్రీం కోర్టుకు వెళ్లబోతున్నామని బీజేపీ ఎల్పీ నేత రాజాసింగ్, ఎమ్మెల్యేలు ఈటల రాజేందర్, రఘునందన్‌రావు తెలిపారు. మంగళవారం హైదరాబాద్‌లోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో వారు మీడియాతో మాట్లాడారు. రాజాసింగ్ మాట్లాడుతూ.. బహిష్కరణకు నిరసనగా ఈ నెల 17న ఇందిరాపార్కు వద్ద నిర్వహించనున్నట్టు ప్రకటించారు. స్పీకర్ మాటల్లో భయం కనిపించిందనీ, దీనిని బట్టే సీఎం కేసీఆర్ ఆయనను ఎంత టార్చర్ పెడుతున్నారో అర్ధమవుతున్నదని చెప్పారు. పోడియం దగ్గరకు వెళ్లని ఈటల, రఘునందన్‌రావును సస్పెండ్ చేయడం అన్యాయమన్నారు. సీఎం కేసీఆర్ ప్లాన్‌ను స్పీకర్ అమలు చేశారని విమర్శించారు. తాజాగా ఏపీ అసెంబ్లీలో 10మంది ఎమ్మెల్యేలు గొడవ చేసినా సస్పెండ్ చేయలేదని గుర్తు చేశారు. అప్పట్లో నిజాంలు ఎంత దౌర్జన్యం చేశారో ఇప్పుడూ కేసీఆర్ అదే చేస్తున్నారని విమర్శించారు.
బీజేపీ ఎమ్మెల్యేల అభ్యర్థనను తిరస్కరించిన స్పీకర్
హైకోర్టు ఆదేశాల మేరకు శాసనసభ నుంచి సస్పెండ్ అయిన బీజేపీ ఎల్పీ నేత రాజాసింగ్, ఎమ్మెల్యేలు ఈటల రాజేందర్, రఘునందన్‌రావులను అసెంబ్లీ కార్యదర్శి నర్సింహాచార్యులు స్పీకర్ పోచారం శ్రీనివాస్‌రెడ్డి వద్దకు తీసుకెళ్లారు. తమను సభకు అనుమతించాలన్న బీజేపీ ఎమ్మెల్యేల అభ్యర్థనను స్పీకర్ తిరస్కరించారు. దీంతో ముగ్గురూ అసెంబ్లీ నుంచి తిరిగి వెళ్లిపోయారు.