Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- గవర్నర్‌కు టీఎస్పీఎస్సీ వార్షిక నివేదిక అందజేత
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల ప్రకటించిన ఉద్యోగాల భర్తీకి సన్నద్ధమవుతున్నామని తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్పీఎస్సీ) ప్రకటించింది. ఈ మేరకు గవర్నర్ తమిళిసై సౌందరరాజన్‌ను మంగళవారం రాజ్‌భవన్‌లో టీఎస్పీఎస్సీ చైర్మెన్ బి జనార్ధన్‌రెడ్డి, సభ్యులు రమావత్ ధన్సింగ్, బండి లింగారెడ్డి, కోట్ల అరుణకుమారి, కారం రవీందర్‌రెడ్డి, అరవెల్లి చంద్రశేఖర్‌రావు, ఆర్ సత్యనారాయణ, కార్యదర్శి అనితా రామచంద్రన్ కలిసి 2020-21కి సంబంధించిన వార్షిక నివేదికను అందజేశారు. 2020, ఏప్రిల్ ఒకటి నుంచి 2021, మార్చి 31 వరకు ఏడాది కాలంలో మూడు నోటిఫికేషన్లనే జారీ చేశామని వివరించారు. 149 పోస్టులను గుర్తించామనీ, అందులో 119 పోస్టుల భర్తీకి నాలుగు పరీక్షలు నిర్వహించామని తెలిపారు. 10,630 మంది అభ్యర్థులు హాజరయ్యారని పేర్కొన్నారు. గతంలో ఇచ్చిన నోటిఫికేషన్లతో కలిపి 2,370 మందికి ఉద్యోగాలు ఇచ్చామని వివరించారు. డిపార్ట్మెంటల్ పరీక్షలు 1,26,381 మంది రాశారనీ, అందులో 53,886 మంది ఉత్తీర్ణత పొందారని తెలిపారు. 136 కోర్టు కేసులను స్వీకరించామని పేర్కొన్నారు. గతంలో ఉన్న వాటిని కలిపి 164 కోర్టు కేసులు పరిష్కారమయ్యాయని వివరించారు. రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల ప్రకటించిన కొత్త పోస్టుల గురించి గవర్నర్‌కు చైర్మెన్ జనార్ధన్‌రెడ్డి వివరించారు.