Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : కేంద్ర సాయుద బలగాల్లో పని చేసి ప్రాణాలు కోల్పో యిన వారి కుటుంబాలను ఆదుకోవ డానికి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ)ఉద్యోగులు మరోమారు ముందుకు వచ్చారు. ఈ వర్గాల కోసం ప్రతీ ఏడాది తరహాలోనే 'సాయుద బలగాల జెండా దినోత్సవం' సందర్బం గా రూ.17,12,200 విలువ చేసే చెక్కును తెలంగాణ రాష్ట్ర గవర్నర్ తమిళసై సౌందర్య రాజన్కు ఎస్బిఐ హైదరాబాద్ సర్కిల్ చీఫ్ జనరల్ మేనేజర్ అమిత్ జింగ్రన్ అందజేశా రు.ఈ మొత్తాన్ని రాష్ట్రంలో పని చేస్తున్న తమ ఉద్యోగులు స్వచ్ఛందంగా అందజేశారని ఎస్బీఐ తెలిపింది.2016 నుంచి దీన్ని వారు కొనసాగిస్తున్నారు.