Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఆస్ట్రియా దిగువ సభ ప్రెసిడెంట్ వుల్ఫ్‌గాంగ్ సోబోట్కా
- అసెంబ్లీని సందర్శించిన ఆస్ట్రియా పార్లమెంట్ సభ్యుల బృందం
- గ్యాలరీ నుంచి శాసనసభ సమావేశాల వీక్షణ
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
తెలంగాణ-ఆస్ట్రియా చట్టసభల మధ్య సారూప్యత ఉందని ఆ దేశ దిగువ సభ అధ్యక్షులు వుల్ఫ్‌గాంగ్ సోబోట్కా అన్నారు. రెండు రోజుల పర్యటన నిమిత్తం రాష్ట్రానికి విచ్చేసిన 17 మందితో కూడిన ఆస్ట్రియా పార్లమెంట్ సభ్యుల బృందం మంగళవారం రాష్ట్ర శాసనసభను సందర్శించింది. ఆ బృందానికి వుల్ఫ్‌గాంగ్ సోబోట్కా, ఆస్ట్రియా ఫెడరల్ కౌన్సిల్ (ఎగువ సభ) అధ్యక్షులు క్రిస్టిని స్క్వార్జ్ పుచ్ నేతృత్వం వహించారు. గ్యాలరీ నుంచి శాసనసభ సమావేశాలను వీక్షించారు. అనంతరం స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి, శాసనమండలి చైర్మెన్ గుత్తా సుఖేందర్ రెడ్డితో శాసనసభ కమిటీహాల్లో వారు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా స్పీకర్ మాట్లాడుతూ...400 ఏండ్లకుపైబడిన హైదరాబాద్ నగరానికి గొప్ప చరిత్ర, ఘనమైన సంస్కృతి సాంప్రదాయాలున్నాయని వారికి వివరించారు. తెలంగాణలోనూ శాసనసభ, శాసనమండలి అనే రెండు చట్టసభలున్నాయని తెలిపారు. తెలంగాణ నూతనంగా ఏర్పడిన రాష్ట్రమైనప్పటికీ అభివృద్ధి, సంక్షేమ రంగాలలో దేశంలోని మిగతా రాష్ట్రాలకు కంటే ముందున్నదని చెప్పారు. సొబోట్కా మాట్లా డుతూ.. ఆస్ట్రియా, తెలంగాణ మధ్య చాలా విషయా లలో సారుప్యత ఉన్నదనీ, తమ పర్యటన ఉభయ దేశాల మధ్య సంబంధాలు ధృడంగా మారడానికి దోహదపడతాయని ఆకాంక్షించారు. తెలంగాణ- ఆస్ట్రియా మధ్య ఆర్ధిక, సాంస్కృతిక, పర్యాటక రంగాలలో బంధానికి అవకాశాలు న్నాయన్నారు. ఆ దేశ పార్లమెంట్ సభ్యులను శాలువా, మెమెంటోలతో స్పీకర్ పోచారం శ్రీనివాస్‌రెడ్డి, మండలి చైర్మెన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి సత్కరించారు. ఈ కార్యక్రమంలో అసెంబ్లీ కార్యదర్శి డాక్టర్ వి.నరసింహాచార్యులు, హైదరాబాద్ ప్రాంతీయ పాస్‌పోర్టు సేవా అధికారి బాలయ్య, తదితరులు పాల్గొన్నారు.
గవర్నర్ తమిళిసైని మర్యాదపూర్వకంగా కలిసిన బృంద సభ్యులు
రాజ్‌భవన్‌లో గవర్నర్ తమిళిసై సౌందర రాజన్‌ను ఆస్ట్రియా పార్లమెంటరీ బృంద సభ్యులు మర్యాదపూర్వకంగా కలిసింది. వారికి గవర్నర్ స్వాగతం పలికారు. శాలువాలు, జ్ఞాపికలతో సత్కరిం చారు. వారితో కాసేపు సంభాషించారు. రెండు దేశాల బంధం, సహకారం మరింత బలోపేతం కావాలని ఆకాంక్షించారు. విద్యా, సాంస్కృతిక మార్పిడి కార్యక్ర మాలను నిర్వహించాలని సూచించారు. ఐక్యరాజ్య సమితిలో మన దేశానికి శాశ్వత సభ్యత్వం విషయంలో మద్దతిచ్చినందుకు కృతజ్ఞతలు తెలిపారు. తెలంగా ణలో పారిశ్రామిక పెట్టుబడులు పెట్టాలని ఆహ్వానిం చారు. రెండు దేశాల మధ్య ఆర్థిక, వాణిజ్య, సైన్స్ అండ్ టెక్నాలజీ, వైద్య, పర్యావరణ రంగాల్లో సంబంధాలు మరింత బలోపేతం కావాలని ఆకాంక్షిం చారు. ఈ కార్యక్రమంలో దిగువ సభ అధ్యక్షులు వుల్ప్ Ûగాంగ్ సోబోట్కా, ఆస్ట్రియా ఫెడరల్ కౌన్సిల్ (ఎగువ సభ) అధ్యక్షులు క్రిస్టిని స్క్వార్జ్ పుచ్, రాయబారి కాథరినా వీజర్, పార్లమెంట్ సభ్యులు పాల్గొన్నారు.