Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ప్రజారవాణా ద్వారానే హైదరాబాద్‌లో ట్రాఫిక్ సమస్యకు పరిష్కారం
- : మండలిలో నర్సిరెడ్డి
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
టీఎస్ఆర్టీసీ అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టాలని ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి డిమాండ్ చేశారు. మంగళవారం శాసనమండలిలో ప్రత్యేక ప్రస్తావనలో ఆయన ఈ అంశాన్ని ప్రభుత్వం దృష్టికి తెచ్చారు. ఆర్టీసీ బస్సుల సంఖ్యను పెంచాలనీ, ప్రజా రవాణా సౌకర్యాన్ని మెరుగుపర్చాలని సూచించారు. తాను హయత్‌నగర్ వద్ద ఉంటాననీ, మండలికి వచ్చేందుకు సోమవారం ఉదయం పది గంటలకు బయలుదేరానని అన్నారు. అయితే హైదరాబాద్‌లో సొంత వాహనదారులు ఎక్కువున్నందున ట్రాఫిక్ సమస్య తీవ్రంగా ఉంటుందన్నారు. తన వాహనంలో కొంతదూరం వచ్చి ట్రాఫిక్‌ను గమనించి మెట్రోలో వచ్చి సమయానికి శాసనమండలి చైర్మెన్ ఎన్నికకు హాజరయ్యానని వివరించారు. ప్రజారవాణా ద్వారానే హైదరాబాద్‌లో ట్రాఫిక్ సమస్య పరిష్కారమవుతుందని చెప్పారు. నగరంలో ఆర్టీసీ బస్సుల సంఖ్య తగ్గుతున్నట్టు కనిపిస్తున్నదని అన్నారు. నష్టాల పేరుతో అలా చేయొద్దనీ, బస్సుల సంఖ్యను పెంచాలని కోరారు. కార్మికులకు వేతన సవరణ అమలు చేయాలనీ, సీసీఎస్ రుణాలు ఇవ్వాలనీ, డీఏ చెల్లించాలని సూచించారు. బడ్జెట్లో రవాణా రంగానికి నిధులు పెంచాలనీ, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వసూలు చేస్తున్న పన్నులను తగ్గించుకోవాలనీ, ఆర్టీసీని పరిరక్షించాలని వివరించారు. కార్మికులపై పనిభారం తగ్గించాలని అన్నారు. సమస్యలను పరిష్కరించేందుకు ప్రభుత్వం తగు చర్యలు తీసుకోవాలని సూచించారు. విద్యాశాఖలో సమస్యలను
పరిష్కరించాలని శాసనమండలి చైర్మెన్ గుత్తా సుఖేందర్‌రెడ్డికి నర్సిరెడ్డి పిటిషన్‌ను సమర్పించారు. కాంట్రాక్టు అధ్యాపకుల క్రమబద్ధీకరణను చేపట్టాలని సూచించారు. ఉపాధ్యాయులకు పదోన్నతులు ప్రభుత్వ జిల్లా పరిషత్, మండల పరిషత్ పాఠశాలల్లో గ్రామపంచాయతీలు, మున్సిపాల్టీలు, కార్పొరేషన్ల ద్వారా పారిశుధ్యం సరైన రీతిలో నిర్వహించడం లేదనీ, ఈ అంశంపై ప్రత్యేకంగా చర్చించాలని కోరుతూ నర్సిరెడ్డి ఇచ్చిన వాయిదా తీర్మానాన్ని తిరస్కరిస్తున్నట్టు చైర్మెన్ ప్రకటించారు.