Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
పిఎఫ్ వడ్డీ రేటు తగ్గించి ఆరుకోట్ల శ్రమజీవుల నడ్డి విరిచిన కేంద్ర ప్రభుత్వ చర్యను ఖండించాలని సీపీఐ(ఎంఎల్) ప్రజాపంథా కోరింది. ఈమేరకు బుధవారం ఆ పార్టీ రాష్ట్రకార్యదర్శి డివి కృష్ణ, రాష్ట్ర సహాయ కార్యదర్శి పోటు రంగారావు ఒక ప్రకటన విడుదల చేశారు. ప్రావిడెంట్ ఫండ్ అనేది సేవింగ్ నిధి కాదనీ, అది సామాజిక భద్రత కోసం రూపొందించిందని పేర్కొన్నారు. కార్మికులు సామాజిక భద్రత గురించి బకాలుపడుతున్న మోడీ కార్మిక వ్యతిరేక విధానాలను తీవ్రంగా ఖండిస్తున్నట్టు తెలిపారు. ఈ ఆర్థిక సంవత్సరంలో తగ్గించిన వడ్డీ తిరిగి వడ్డీని 8.8 శాతంగా పునరుద్దరించాలని డిమాండ్ చేశారు.