Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మత్స్య శాఖ కమిషనర్ టీఎమ్‌కేఎమ్‌కేఎస్ వినతి
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
చెరువులు, కుంటలకు పెంచిన లీజు తగ్గించాలని తెలంగాణ మత్స్యకారులు, మత్య్స కార్మిక సంఘం (టీఎమ్‌కేఎమ్‌కేఎస్) ప్రధాన కార్యదర్శి లెల్లెల బాలకృష్ణ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ మేరకు మత్స్యశాఖ కమిషనర్‌కు వినతి పత్రం అందజేశారు. రాష్ట్ర ప్రభుత్వం,మత్స్యశాఖ ద్వారా జీవో నెంబర్ 268 తీసుకువచ్చిందని తెలిపారు. దీని ప్రకారం ప్రతి మత్స్య పారిశ్రామిక, సహకార సంఘాల, సొసైటీల పరిధిలో ఉన్న గ్రామపంచాయతీ చెరువులు కుంటలపై పది రెట్లు లీజు పెంచారని తెలిపారు. పెంచిన చెరువులు కుంటలకు పెంచిన లీజులను వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో సంఘం రాష్ట్ర అధ్యక్షులు గోరెంకల నరసింహ, ఉపాధ్యక్షులు ముఠావిజరుకుమార్, కార్యదర్శి అర్వపల్లి శ్రీరాములు రాష్ట్ర కమిటీ సభ్యులు ముఠాదశరథ్, గాండ్ల అమరావతి తదితరులు పాల్గొన్నారు.