Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఐఎఫ్టీయూ పోస్టరావిష్కరణలో కె.సూర్యం
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
దేశవ్యాప్తంగా ఈ నెల 28,29 తేదీల్లో తలపెట్టిన సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయాలని ఐఎఫ్టీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.సూర్యం పిలుపునిచ్చారు. బుధవారం హైదరాబాద్లోని మార్క్స్భవన్లో సమ్మె పోస్టర్ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..మోడీ ప్రభుత్వం వచ్చాక కార్మిక వ్యతిరేక విధానాలను అనురిస్తున్నదనీ, ప్రభుత్వ రంగ సంస్థలను అమ్మేస్తున్నదని విమర్శించారు. ఆదాయ పన్ను పరిధిలోకి రాని కార్మికుల కుటుంబాలకు ఆహారం, ఉపాధి కోసం రూ.7,500 ఇవ్వాలనీ, పెట్రోల్ ఉత్పత్తులపై సెంట్రల్ ఎక్సైజ్ డ్యూటీ తగ్గించాలని డిమాండ్ చేశారు. నిత్యావసరాల ధరలు పెరగకుండా నిర్ధిష్ట చర్యలు తీసుకోవాలని కోరారు. రాష్ట్ర ప్రభుత్వం కనీస వేతనాల జీవోలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల అధ్యక్షులు ఎస్.ఎల్.పద్మ మాట్లాడుతూ..నరేంద్రమోడీ సర్కారు దేశభక్తి ముసుగులో దేశ విధ్వంసకర చర్యలకు పూనుకున్నదని విమర్శించారు. నాలుగు లేబర్ కోడ్లను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. సమ్మెను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల కార్యదర్శి వి.ప్రవీణ్, ఉపాధ్యక్షులు వి.కిరణ్, కోశాధికారి నల్లన్న, షహనాజ్ బేగం, నర్సిరెడ్డి, రవీందర్, శ్రీనివాస్, లక్ష్మి, పాషా, ప్రభాకర్, తదితరులు పాల్గొన్నారు.