Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- గజేంద్ర షెకావత్‌ను కోరిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజరు
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
కృష్ణా జలాల పంపిణీపై కొత్త ట్రిబ్యునల్ ఏర్పాటు చేయాలని కేంద్ర జల వనరుల శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్‌ను బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజరుకుమార్ కోరారు. బుధవారం పార్లమెంట్ హౌజ్‌లో ఆదిలాబాద్ ఎంపీ సోయం బాపూరావు, బీజేపీ తమిళనాడు రాష్ట్ర వ్యవహారాల సహ ఇంఛార్జ్ పొంగులేటి సుధాకర్ రెడ్డి, పార్లమెంటరీ పార్టీ కార్యాలయ కార్యదర్శి కామర్సు బాలసుబ్రమణ్యం, మాజీ ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి, రాష్ట్ర ఉపాధ్యక్షులు డాక్టర్ గంగిడి మనోహర్ రెడ్డి, కార్యదర్శి డాక్టర్ ప్రకాశ్ రెడ్డిలతో కలిసి ఆయన కేంద్ర మంత్రిని కలిశారు. కృష్ణా నదీ జలాల పంపిణీలో తెలంగాణకు జరుగుతున్న అన్యాయంపై చర్చించారు. ప్రస్తుతమున్న బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ వల్ల నీటి కేటాయింపుల విషయంలో తెలంగాణకు న్యాయం జరిగే అవకాశం లేదని కేంద్ర మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. కొత్త ట్రిబ్యునల్ ఏర్పాటు చేస్తేనే తెలంగాణ-ఏపీ రాష్ట్రాల మధ్య నెలకొన్న సమస్య పరిష్కారమవుతాయని అభిప్రాయపడ్డారు.