Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పోస్టుల నియామకంలో అవినీతికి ఆస్కారం..?
- 'ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ'పై నిర్లక్ష్యం
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
రాష్ట్ర ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ (శాక్స్)లో ఉద్యోగ నిబంధనలను ఉల్లంఘిస్తున్నారు. శాక్స్ ఇటీవల విడుదల చేసిన రాష్ట్ర వ్యాప్తంగా కాంట్రాక్ట్ పద్ధతిన ల్యాబ్ టెక్నిషీయన్లు, కౌన్సిలర్ల ఉద్యోగాల నోటిఫికేషన్ విమర్శలకు దారి తీసింది. నియమ, నిబంధనలకు విరుద్దంగా ల్యాబ్ టెక్నిషీయన్లు, కౌన్సిలర్ల ఉద్యోగాల భర్తీ జరగనున్నట్టు ప్రచారం జ రుగుతోంది. పోస్టుల నోటిఫికేషన్ నుంచి మొదలు నియామక విధానం వరకు అనేక అనుమానాలు, ఆరోపణలున్నాయి. ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీలో ఇదివరకు పోస్టుల భర్తీకి ముందే రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యోగ బదిలీలు చేపట్టేవారు. సీనియార్టీనీ, ఆయా జిల్లాల్లోని డిమాండ్ దృష్టిలో పెట్టుకుని బదిలీలు చేపట్టేవారు. కానీ తాజాగా ఆ విధానానికి స్వస్తిపలికి, బదిలీలు చేపట్టకుండానే నోటిఫికేషన్ విడుదల చేసినట్టు సొసైటీలో కొందరు ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీని వల్ల కొందరు సీనియర్లకు అన్యాయం జరుగుతుందని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ప్రస్తుతం పని చేస్తున్న సీనియర్లను బదిలీ చేసిన తర్వాత, ఏర్పడిన ఖాళీలను దృష్టిలో పెట్టుకుని నోటిఫికేషన్ విడుదల చేస్తారనీ, కానీ ప్రస్తుతం పాత మార్గదర్శ కాలను పక్కన పెట్టారని చెబుతున్నారు. ప్రస్తుతం ఆయా జిల్లాలో పని చేస్తున్న కొందరు సీని యర్లు బదిలీలు చేపట్టాలని కోరుతున్న ప్పటికీ స్పందించడం లేదనీ, బదిలీ విషయమై ఉన్నతాధికారులను ఆశ్ర యిస్తే వేధింపులకు గురిచేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆరోగ్య సమస్యలున్న వారిని కూడా బదిలీలు చేయడం లేదని చెబుతున్నారు. ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీపై ప్రభుత్వం నిర్లక్షం వహించడం ద్వారానే ఉన్నతాధి కారులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నా రని ఉద్యోగులు వాపోతున్నారు.
సూపరింటెండెంట్లకు నియామక బాధ్యత..?
అప్పగించినట్టు తెలిసింది. ల్యాబ్ టెక్నిషీయన్లు, కౌన్సిలర్ల పోస్టులను ఇది వరకు ప్రాజెక్ట్ డైరెక్టర్ ఈ పోస్టులను నియమించ ేవారు. కానీ ప్రస్తుతం ఆ విధానానికి భిన్నంగా నియామక బాధ్యతను సూపరింటెండెంట్ అప్పగించడంతో అవినీతి జరిగే అవ కాశాలు ఉన్నాయని, అర్హులైన వారికి కాకుండా తమకిష్టమొచ్చిన వారిని నియమించే పరిస్థితులు ఉంటాయని పలువురు చెబుతున్నారు. అర్హత ఆధారంగా ప్రాజెక్ట్ డైరక్టర్ నియామకాలు చేపట్టాలని పలువురు కోరుతున్నారు.
ఆ ఉత్తర్వులు కొందరికే
మ్యూచువల్ బదిలీలు విషయంలో కూడా అన్యాయం జరుగుతోందని ఉద్యోగులు వాపోతున్నారు. ఈ బదిలీలపై 2018, సెప్టెంబర్లో ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ ఒక సర్క్యూలర్ జారీ చేసింది. కానీ ఈ సర్కూలర్ కొందరి కోసమే తీసుకొచ్చారనీ, రాజకీయ ఒత్తిడిలో భాగంగానే కొందరిని బదిలీ చేశారనే విమర్శలున్నాయి. ఇదే అదునుగా కొందరు ప్రజాప్రతినిధుల పేరు చెప్పుకుని కొందరు కౌన్సిలర్లను ఇతర జిల్లాలకు బదిలీ చేశారనే విమర్శలు ఉన్నాయి. ఇప్పటికైనా సీనియర్లను, మ్యూచువల్ బదిలీలు చేయాలని, ఆ తర్వాత ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయాలని సీనియర్లు కోరుతున్నారు. నోటిఫికేషన్ ప్రకారం కొత్త పోస్టులను భర్తీ చేసిన తర్వాత ఇక సీనియర్లను బదిలీ చేయడం కష్టసాధ్యమని కొందరు ఉద్యోగులు వాపోతున్నారు.