Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎస్.వీరయ్య
నవతెలంగాణ-రాజేంద్రనగర్
కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన నూతన లేబర్ కోడ్లను రద్దు చేయాలని, కార్మిక, ప్రజావ్యతిరేక విధానాలకు నిరసనగా ఈ నెల 28, 29న జరిగే దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయాలని సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎస్. వీరయ్య కార్మికులకు పిలుపునిచ్చారు. 'కేంద్ర కార్మిక సంఘాలు, ఉద్యోగ సంఘాల జాతీయ ఫెడరేషన్ ఆధ్వర్యంలో ఈ నెల జరగనున్న సమ్మెను విజయవంతం చేయాలని బుధవారం కాటేదాన్‌లోని రంగారెడ్డి జిల్లా సీఐటీయూ కార్యాలయంలో నాయకులతో కలిసి సమ్మె పోస్టర్‌ను ఆవిష్కరించారు. అనంతరం వీరయ్య మాట్లాడుతూ.. ఈ నెల 28, 29 న జరిగే సమ్మె.. కేవలం కార్మికుల సమస్యల కోసం మాత్రమే కాదని దేశ ప్రజల కోసం, దేశ భద్రత కోసం 'ప్రజలను కాపాడుకుందాం- దేశాన్ని రక్షించుకుందాం' అన్న నినాదంతో సమ్మె జరుగుతున్నదని తెలిపారు. రైతు వ్యతిరేక చట్టాలను రద్దు చేసిన ప్రభుత్వం, పంటల మద్దతు ధరలు చట్టబద్ధం చేయాలని డిమాండ్ చేశారు. కార్మికులు పెద్ద సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని తెలిపారు. కార్యక్రమంలో సీఐటీయూ రంగారెడ్డి జిల్లా ఉపాధ్యక్షులు జగదీశ్, ప్రేమాజీ తదితరులు పాల్గొన్నారు.