Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- వినియోగదారుల దినోత్సవంలో పీఎన్బీ
హైదరాబాద్ : ఖాతాదారుల ఆసక్తులే కీలకంగా తమ సేవలను మరింత మెరుగుపర్చినట్లు పంజాబ్ నేషనల్ బ్యాంక్ (పీఎన్బీ) వెల్లడించింది. ప్రపంచ వినియోగదారుల దినోత్సవం మార్చి 15 సందర్బంగా ఆ బ్యాంక్ పలు కార్యక్రమాలు నిర్వహించింది. ఖాతాదారుల పట్ల తమ అంకితభావం నేపథ్యంలో తమ డిజిటల్ వేదికను మరింత మెరుగుపర్చామని పేర్కొంది. వినియోగదారుల దినోత్సవాన్ని న్యూఢిల్లీలోని తమ ప్రధాన కార్యాలయంతో పాటు హైదరాబాద్లోని జోనల్ ఆఫీసులోనూ నిర్వహించినట్లు వెల్లడించింది. ఖాతాదారుల ఆసక్తులకు అనుగుణంగా బ్యాంక్ సిబ్బంది సేవలందించాలని పీఎన్బీ ఎండీ, సీఈఓ అతుల్ కుమార్ గోయల్ సూచించారు.