Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్లో నిర్మాణ వివాదాల పరిష్కారం కోసం బిల్డింగ్ ట్రిబ్యునల్‌ను ఎప్పటిలోగా ఏర్పాటు చేస్తారో చెప్పాలని మరోసారి హైకోర్టు ప్రశ్నించింది. ట్రిబ్యునల్ ఏర్పాటు చేయాలని 2019లో పిల్ దాఖలైతే ఇంతవరకు కౌంటర్ కూడా దాఖలు చేయకపోవడంపై మునిసిపల్ శాఖపై ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది. ఆరు వారాల్లోగా కౌంటర్ దాఖలు చేయాలని ఆశాఖ ముఖ్య కార్యదర్శిని ఆదేశించింది. ఆరు వారాల్లోగా కౌంటర్ దాఖలు చేయనిపక్షంలో తదుపరి విచారణకు స్వయంగా హాజరుకావాలని ఆయనను ఆదేశించింది. ఈ మేరకు బుధవారం ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సతీష్‌చంద్రశర్మ, న్యాయమూర్తి జస్టిస్ అభినంద్‌కుమార్ షావిలిలతో కూడిన ధర్మాసనం నోటీసులు జారీ చేసింది. ట్రిబ్యునల్ ద్వారా నిర్మాణ వివాదాల పరిష్కారం చేసే నిమిత్తం 2016లో మున్సిపల్ చట్టాన్ని సవరించినా ఇప్పటి వరకు ట్రిబ్యునల్‌కు చైర్పర్సన్, సభ్యుల నియామకాలు చేయలేదని ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ దాఖలు చేసిన పిల్ దాఖలు చేసింది. ఆరు వారాల్లోగా ప్రభుత్వ వైఖరిని చెప్పాలంది.