Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మార్చి 23 నుంచి ఏప్రిల్ 8 వరకు ఇంటర్ ప్రాక్టికల్స్
- పరీక్షల షెడ్యూల్లో మరోమారు మార్పులు
- తేదీలను ప్రకటించిన బోర్డు కార్యదర్శి సయ్యద్ ఒమర్ జలీల్
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
ముచ్చటగా మూడోసారీ ఇంటర్మీడియట్ పరీక్షల తేదీల్లో మార్పులు జరిగాయి. కొత్త షెడ్యూల్ ప్రకారం మే నెల ఆరో తేదీ నుంచి 24 వరకు పరీక్షలు నిర్వహిస్తామని ఇంటర్‌బోర్డు కార్యదర్శి సయ్యద్ ఒమర్ జలీల్ ప్రకటించారు. పరీక్షలు ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు జరుగుతాయని తెలిపారు. ఈ మేరకు బుధవారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. మార్చి 23 నుంచి ఏప్రిల్ 8 వరకు ప్రాక్టికల్ ఎగ్జామ్స్ జరుగుతాయి. ఆదివారాల్లోనూ ప్రాక్టికల్స్ నిర్వహించనున్నారు. ఏప్రిల్ 11, 12 తేదీల్లో విలువలు, మానవ సంబంధాలు, ఎన్విరాన్మెంటల్ ఎడ్యుకేషన్ పరీక్షలను నిర్వహించనున్నారు. వొకేషనల్ కోర్సులకూ ఇవే రోజుల్లో పరీక్షలు నిర్వహించనున్నారు. అయితే, ఆ కోర్సులకు ప్రత్యేకంగా షెడ్యూల్ విడుదల చేయనున్నారు. పదో తరగతి పరీక్షలు మే 23 నుంచి జూన్ ఒకటో తేదీ వరకు నిర్వహించనున్నట్టు సెకండరీ స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ ఎ.కృష్ణారావు తెలిపారు. పరీక్షలన్నీ ఉదయం 9:30 నిమిషాలకు మొదలై మధ్యాహ్నం 12:45 నిమిషాల వరకు జరుగుతాయని పేర్కొన్నారు. ఈ మేరకు ఆయన బుధవారం ఒక ప్రకటన విడుదల చేశారు.
ఇంటర్ మొదటి సంవత్సరం పరీక్షల టైంటేబుల్ (ఉదయం 9:00 నుంచి మధ్యాహ్నం 12:00వరకు)
06.05.2022(శుక్రవారం) సెకండ్ లాంగ్వేజ్ పేపర్ -1
09.05.2022(సోమవారం) ఇంగ్లీష్ పేపర్-1
11.05.2022(బుధవారం) మ్యాథమెటిక్స్ పేపర్-1ఏ, బాటనీపేపర్-1, పొలిటికల్‌సైన్స్ పేపర్-1
13.05.2022(శుక్రవారం) మ్యాథమెటిక్స్పేపర్-1బి, జువాలజీపేపర్-1, హిస్టరీపేపర్-1
16.05.2022(సోమవారం) పిజిక్స్ పేపర్-1, ఎకనామిక్స్ పేపర్-1
18.05.2022(బుధవారం) కెమిస్ట్రీ పేపర్-1, కామర్స్ పేపర్-1
20.05.2022(శుక్రవారం) పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ పేపర్-1, బ్రిడ్జి కోర్సు మ్యాథ్స్పేపర్-1
23.05.2022(సోమవారం) మోడ్రన్ లాంగ్వేజ్ పేపర్-1, జియోగ్రపీ పేపర్-1
ఇంటర్ ద్వితీయ సంవత్సరం పరీక్షల టైంటేబుల్ (ఉదయం 9:00 నుంచి మధ్యాహ్నం 12:00వరకు)
07.05.2022(శని వారం) సెకండ్ లాంగ్వేజ్ పేపర్-2
10.05.2022(మంగళవారం) ఇంగ్లీష్పేపర్ -2
12.05.2022(గురువారం) మ్యాథమెటిక్స్ పేపర్-2ఏ, బాటనీ పేపర్-2, పొలిటికల్ సైన్స్ పేపర్-2
14.05.2022(శనివారం) మ్యాథమెటిక్స్ పేపర్-2బి, జువాలజీ పేపర్-2, హిస్టరీ పేపర్-2
17.05.2022(మంగళ వారం) పిజిక్స్ పేపర్-2, ఎకనామిక్స్ పేపర్-2
19.05.2022(గురు వారం) కెమిస్ట్రీ పేపర్-2, కామర్స్ పేపర్-2
21.05.2022(శని వారం) పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ పేపర్-2, బ్రిడ్జి కోర్సు మ్యాథ్స్ పేపర్-2
24.05.2022(మంగళ వారం) మోడ్రన్ లాంగ్వేజ్ పేపర్-2, జియోగ్రఫీ పేపర్-2
పదో తరగతి షెడ్యూల్ ఇలా..
తేదీ సబ్జెక్టు పేపరు
23.05.2022 (సోమవారం) ఫస్ట్ లాంగ్వేజ్ పేపర్-1, ఫస్ట్లాంగ్వేజ్ పేపర్-1(కాంపోజిట్ కోర్సు),
ఫస్ట్లాంగ్వేజ్ పేపర్-2(కాంపోజిట్కోర్సు)
24.05.2022 (మంగళవారం) సెకండ్ లాంగ్వేజ్
25.05.2022 (బుధవారం) థర్డ్ లాంగ్వేజ్
26.05.2022 (గురువారం) మ్యాథమెటిక్స్
27.05.2022 (శుక్రవారం) జనరల్ సైన్స్(పిజికల్ సైన్స్, బయోలాజికల్ సైన్స్
28.05.2022 (శనివారం) సోషల్ స్టడీస్
30.05.2022 (సోమవారం) ఓఎస్ఎస్సీ మెయిన్ లాంగ్వేజ్ పేపర్-1(సంస్కృతం, అరబిక్)
31.05.2022 (మంగళవారం) ఓఎస్ఎస్సీ మెయిన్ లాంగ్వేజ్ పేపర్ -2(సంస్కృతం, అరబిక్)
01.06.2022 (బుధవారం) ఎస్ఎస్సీ ఒకేషనల్ కోర్సు(థీరి)A