Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కాంట్రాక్టు ఉద్యోగుల క్రబద్ధీకరణ అమలు సాధన సమితి
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
రాష్ట్రంలో కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణ ప్రక్రియను చేస్తున్నందుకు విద్యాశాఖ మంత్రి పి సబితా ఇంద్రారెడ్డికి 16 జీవో కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణ అమలు సాధన సమితి, కాంట్రాక్టు అధ్యాపకుల సంఘం ధన్యవాదాలు ప్రకటించాయి. 22 ఏండ్లుగా వెట్టిచాకిరి చేస్తున్నామనీ, ప్రభుత్వ నిర్ణయం సంతోషకరమని తెలిపాయి. క్రమబద్ధీకరణ ప్రక్రియను వేగవంతం చేయాలని కోరాయి. సీఎం కేసీఆర్ చారిత్రాత్మక నిర్ణయం తీసుకున్నారని మంత్రి సబితా ఇంద్రారెడ్డి చెప్పారు. ప్రభుత్వ కాలేజీలను కాపాడేందుకు కాంట్రాక్టు అధ్యాపకులు కృషిచ ేయాలని కోరారు.అనంతరం ఉన్నత విద్యాశాఖ కమిషనర్ నవీన్ మిట్టల్,ఇంటర్ విద్యాశాఖ కమిష నర్ సయ్యద్ ఒమర్ జలీల్‌ను కలిసి ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో టిగ్లా ప్రధాన కార్యదర్శి, టిప్స్ రాష్ట్ర కన్వీనర్ మాచర్ల రామకృష్ణగౌడ్, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ కాలేజీల కాంట్రాక్టు లెక్చరర్ల సంఘం (టీఎస్‌జీసీసీఎల్‌ఏ-475) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, సాధన సమితి రాష్ట్ర కన్వీనర్ కొప్పిశెట్టి సురేష్, పాలిటెక్నిక్ కాంట్రాక్టు లెక్చరర్ల సంఘం రాష్ట్ర అధ్యక్షులు జి ఉదరుభాస్కర్, కాంట్రాక్టు లెక్చరర్ల సంఘం (475) ఉపాధ్యక్షులు ఎం శ్రీనివాస్‌రెడ్డి, అసోసియేట్ ప్రెసిడెంట్ కెపి శోభన్‌బాబు, నాయకులు గంగాధర్, గోవర్ధన్, విశాలాక్ష్మి, మురళీకృష్ణ, నవీన్, శ్రవణ్ తదితరులు పాల్గొన్నారు.