Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- విద్యామంత్రికి టీఎంఎస్టీఏ వినతి
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
మోడల్ స్కూళ్లలో పనిచేస్తున్న ఉపాధ్యాయులకు వేసవి కాలంలో పదోన్నతులు, బదిలీల ప్రక్రియను చేపట్టాలని టీఎంఎస్టీఏ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరింది. ఈ మేరకు విద్యాశాఖ మంత్రి పి సబితా ఇంద్రారెడ్డిని గురువారం హైదరాబాద్లో టీఎంఎస్టీఏ అధ్యక్షులు భూతం యాకమల్లు, పీఆర్టీయూ తెలంగాణ అధ్యక్షులు ఎం చెన్నయ్య నేతృత్వంలో కలిసి వినతిపత్రం సమర్పించారు. తొమ్మిదేండ్లుగా బదిలీల్లేక ఒకే దగ్గర పనిచేస్తున్నామని తెలిపారు. గతంలో సర్వీసు రూల్స్ రాగానే బదిలీలు చేస్తామంటూ హామీ ఇచ్చారని గుర్తు చేశారు. సర్వీసు రూల్స్ వచ్చి రెండేండ్లయినా చేయలేదని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో టీఎంఎస్టీఏ అసోసియేట్ అధ్యక్షులు యాదగిరి, ఉపాధ్యక్షులు శినయ్య తదితరులు పాల్గొన్నారు.