Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మంత్రి సబితకు డీఎడ్ ద్వితీయ విద్యార్థుల వినతి
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్) రాసేందుకు అవకాశం కల్పించాలని 2020-22 బ్యాచ్‌కు చెందిన డీఎడ్ (డీఈఐఈడీ) ద్వితీయ సంవత్సరం విద్యార్థులు రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. ఈ మేరకు విద్యాశాఖ మంత్రి పి సబితా ఇంద్రారెడ్డిని గురువారం హైదరాబాద్‌లో పలువురు విద్యార్థులు కలిసి వినతిపత్రం సమర్పించారు. కోవిడ్ నేపథ్యంలో మొదటి విద్యాసంవత్సరం 2021, ఫిబ్రవరిలో ప్రారంభమైందని గుర్తు చేశారు. 2022-23 విద్యాసంవత్సరం ప్రారంభం కావడానికి ముందే తమ కోర్సు పూర్తి కావాల్సి ఉందని తెలిపారు. కానీ ఇటీవల అకడమిక్ క్యాలెండర్‌ను ప్రభుత్వ పరీక్షల విభాగం ప్రకటించిందనీ, దాని ప్రకారం తమ కోర్సు చివరి పనిదినం డిసెంబర్ ఆరు వరకు ఉందని పేర్కొన్నారు.