Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
సమ్మక్క, సారాలమ్మ దేవతలపై చినజీయర్ స్వామి చేసినట్టు ప్రచారం జరుగుతున్న వ్యాఖ్యలపై స్పష్టతనివ్వాలని టీపీసీసీ ఉపాధ్యక్షులు జి నిరంజన్ డిమాండ్ చేశారు. ఒకే మతంలో వివాదాలు చిచ్చు చెలరేగే ప్రమాదమున్నదని చెప్పారు. గురువారం హైదరాబాద్‌లోని గాంధీభవన్‌లో ఆయన విలేకర్లతో మాట్లాడారు. సమతామూర్తి దర్శనానికి ధర్మ దర్శనం ఉచితంగా కల్పించాలనీ, ప్రత్యేక దర్శనానికి ఫీజు టికెట్ ద్వారా వసూలు చేయాలని డిమాండ్ చేశారు.
ఫీల్డ్ అసిస్టెంట్లకు రెండేండ్లకు వేతనాలివ్వాలి : దాసోజు
ఫీల్డ్ అసిస్టెంట్లను విధుల్లోకి తీసుకుంటామని చెప్పిన ప్రభుత్వం...వారికి రెండేండ్లకు వేతనాలు ఇవ్వాలని ఏఐసీసీ అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్ డిమాండ్ చేశారు. వివిధ కారణాలనతో వారిని రెండేండ్లుగా ప్రభుత్వం ఇబ్బందులు పెట్టిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కాలంలో 70 మంది ఫీల్డ్ అసిస్టెంట్లు చనిపోయారని చెప్పారు. గురువారం హైదరాబాద్‌లోని గాంధీభవన్‌లో టీపీసీసీ ఫిషర్‌మేన్ రాష్ట్ర చైర్మెన్ మెట్టు సాయికుమార్‌తో కలిసి ఆయన విలేకర్లతో మాట్లాడారు.