Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హైదరాబాద్బ్యూరో
దక్షిణ మధ్య రైల్వే ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో సరుకు రవాణా ద్వారా రికార్డు స్థాయిలో రూ.10 వేల కోట్ల ఆదాయాన్ని ఆర్జించినట్టు ఆ సంస్థ జనరల్ మేనేజర్ సంజీవ్ కిశోర్ తెలిపారు. ఈ మేరకు గురువారంనాడొక పత్రికా ప్రకటన విడుదల చేశారు. 2020-2021తో పోలిస్తే ఈ ఏడాది17.7 శాతం అధిక ఆదాయం, 17.3 శాతం అధిక లోడింగ్ సాధించినట్టు తెలిపారు. బొగ్గు 53.78 మెట్రిక్ టన్నులు, సిమెంట్ 32.339 మె.టన్నులు, ఆహార ధాన్యాలు 7.980 మె.టన్నులు, ఎరువులు 5.925 మె.టన్నులు, కంటైనర్ల సేవలు 2.137 మె.టన్నులు, స్టీల్ ప్లాంట్ల కోసం ముడి సరుకు 4.14 మె,టన్నులు, అల్మూనియా పౌడర్, ఫ్లైయాష్, గ్రానైట్, చెక్కర మొదలైనవి 5.80 మె.టన్నుల లోడింగ్ జరిగినట్టు వివరించారు.