Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
ప్రభుత్వ డిగ్రీ కాలేజీల్లో పనిచేస్తున్న కాంట్రాక్టు అధ్యాపకుల వేతనాలను రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేసింది. ఈ మేరకు రూ.16 కోట్లు మంజూరు చేస్తూ విద్యాశాఖ కార్యదర్శి సందీప్‌కుమార్ సుల్తానియా గురువారం ఉత్తర్వులు విడుదల చేశారు. వేతనాలు మంజూరు చేయడం పట్ల ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రులు హరీశ్‌రావు, సబితా ఇంద్రారెడ్డికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ కాలేజీల కాంట్రాక్టు లెక్చరర్ల సంఘం (టీఎస్‌జీసీసీఎల్‌ఏ-475) రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు జి రమణారెడ్డి, కొప్పిశెట్టి సురేష్ ధన్యవాదాలు తెలిపారు.