Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కేసీఆర్ నియంతృత్వానికి ప్రజలు బుద్ధిచెప్పే రోజులు దగ్గర్లో : ఎమ్మెల్యే ఈటల
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
హరీశ్ రావువి దొంగలెక్కలు.. కాకి లెక్కల బడ్జెట్ అని కాగ్ నివేదిక చెప్పిందనీ, అది ముమ్మాటికీ వాస్తవమని బీజేపీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి ఈటల రాజేందర్ అన్నారు. బడ్జెట్ లొసుగులను బయటపెడతామనే అన్యాయంగా తమను సస్పెండ్ చేశారని ఆరోపించారు. కేసీఆర్, హరీశ్తరావుకు దమ్ముంటే బడ్జెట్‌పై తనతో చర్చకు రావాలని సవాల్ విసిరారు. గురువారం హైదరాబాద్‌లోని ఇందిరాపార్కు వద్ద బీజేపీ ఆధ్వర్యంలో ప్రజాస్వామ్య పరిరక్షణ దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గవర్నర్‌ను అవమానించి శాసనసభకు మచ్చతెచ్చిన చిల్లర సీఎం కేసీఆర్ అన్నారు. ఆర్టీసీ, మున్సిపల్ కార్మికులను కేసీఆర్ తొలగించాలన్నప్పుడు తాను అడ్డుపడ్డానని చెప్పారు. ఆర్టీసీలో కార్మిక సంఘాలను రద్దు చేయించిన దుర్మార్గపు సీఎం కేసీఆర్ అని విమర్శించారు. మద్యం అమ్మకాలతోనే రాష్ట్ర సర్కారు నడుస్తున్నదన్నారు. ఏడాదికి 90రోజులు జరగాల్సిన అసెంబ్లీ సమావేశాలను 30రోజులకు తీసుకొచ్చిన ఘనత కేసీఆర్ దేనన్నారు. కేసీఆర్ అహంకారానికి, ప్రజల ఆత్మగౌరవానికి మధ్య పోరాటం జరుగుతున్నదనీ, ఆయన నియంతృత్వానికి బుద్ధిచెప్పే రోజులు దగ్గర్లోనే ఉన్నాయని చెప్పారు. ఆయన్ను పీకేలు కాపాడలేరన్నారు.బీజేపీ ఎల్పీ నేత రాజాసింగ్ మాట్లాడుతూ.. తెలంగాణలో అవినీతి దొంగలపై బుల్డోజర్లను ఎక్కిస్తామని హెచ్చరించారు.