Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న చర్యలతో మత్స్యసంపద పెరిగిందని మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ చెప్పారు. గురువారం హైదరాబాద్‌లోని ఎమ్సీహెచ్ఆర్డీలో మత్స్యకారుల జేఏసీ ప్రతినిధులతో మంత్రి సమావేశం అయ్యారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ బండ ప్రకాశ్ ముదిరాజ్, ఎమ్మెల్యే ముఠాగోపాల్, మత్స్య శాఖ కమిషనర్ లచ్చిరాం భూక్యా, పలు జిల్లాలకు చెందిన గంగపుత్ర, ముదిరాజ్ సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు. మత్స్యకారులు ఆర్ధికంగా, సామాజికంగా అభివృద్ధి సాధించాలనేది సీఎం కేసీఆర్ ఆలోచన అని చెప్పారు. సంపద సృష్టించాలి... దానిని పేదలకు పంచాలనే విధానంతో ప్రభుత్వం ముందుకెళ్తున్నదని తెలిపారు. తెలంగాణ ఏర్పాటుకు ముందు 5 వేల చెరువులుంటే... నేడు 23 వేలకు పెరిగా యని చెప్పారు. దేశంలో ఎక్కడా లేని విధంగా ఉచితంగా చేప, రొయ్య పిల్లలు అందిస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ ప్రభుత్వ మని వివరిం చారు. అర్హులైన ప్రతి మత్స్య కారుడు ప్రభుత్వ లబ్ది పొందేలా సొసైటీలో సభ్యత్వం కల్పించే దిశగా చర్యలు తీసుకుంటామని చెప్పారు.