Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- బీజేపీ దీక్షపై టీఆర్ఎస్ నేతలు
నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
బీజేపీ నేతలు ఇందిరా పార్కు దగ్గర చేసిన దీక్షలో తమపై చేసిన విమర్శలు అర్థరహితమని ప్రభుత్వ విప్ బాల్క సుమన్, ఎమ్మెల్సీ ఎగ్గే మల్లేశం అన్నారు. గురువారంనాడిక్కడి టీఆర్ఎస్ శాసనసభాపక్ష కార్యాలయంలో వారు మీడియాతో మాట్లాడారు. ఎమ్మెల్యేల సస్పెన్షన్లు తెలంగాణ లోనే మొదలయినట్టు బీజేపీ నేతలు నీతులు చెబుతున్నారనీ, వారు అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో ప్రతిపక్ష ఎమ్మెల్యేలను ఎందుకు సస్పెండ్ చేస్తున్నారని ప్రశ్నించారు. హిమాచల్‌ప్రదేశ్ గవర్నర్‌గా బండారు దత్తాత్రేయ ఉన్నపుడు ఆరుగురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలను సస్పెండ్ చేయలేదా? అని ప్రశ్నించారు. బీజేపీ నేతలు ముఖ్యమంత్రి కేసీఆర్‌ను తిట్టినట్టే తాము కూడా ప్రధాని నరేంద్రమోడీ, హౌంమంత్రి అమిత్‌షాలను తిట్టగలమని హెచ్చరించారు. టీఆర్ఎస్ విధానం వికాసం అనీ, బీజేపీ నేతల విధానం విద్వంసమని అన్నారు. బుల్డోజర్ల భాష వాడుతూ తెలంగాణ పల్లెల్లో విధ్వంసం సృష్టించాలని బీజేపీ ప్రయత్నిస్తున్నదని విమర్శించారు. బీజేపీ ఎంపీలు విభజన హామీల అమలు కోసం ఢిల్లీలో దీక్షలు చేయాలని సూచించారు. కాళేశ్వరానికి జాతీయ హౌదాపై ఎందుకు మాట్లాడరని అడిగారు. గుజరాత్‌కు తెలంగాణ బీజేపీ నేతలు బానిసలుగా మారారని విమర్శించారు.
శ్రద్ధగా చదవండి...పాలనలో భాగస్వాములవ్వండి
ఎమ్మెల్సీ కవిత హౌలీ వీడియో సందేశం
యువతరం పోటీ పరీక్షలపై దృష్టిపెట్టి చదివి, ఉద్యోగాలు సాధించి పరిపాలనలో భాగస్వాములు కావాలని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఆకాంక్షించారు. హౌలీ వేడుకలను పురస్కరించుకొని ఆమె వీడియో సందేశం విడుదల చేశారు. సెర్ప్, మెప్మా, ఐకేపీ, మధ్యాహ్న భోజన కార్మికుల కుటుంబాల్లో ముఖ్యమంత్రి కేసీఆర్ వెలుగులు నింపారని తెలిపారు. హౌలీని సహజ రంగులతో పండుగ జరుపుకోవాలని విజ్ఞప్తి చేశారు. 80,039 ప్రభుత్వ ఉద్యోగాలకు త్వరలోనే నోటిఫికేషన్లు విడుదల చేస్తామని శాసనసభలో సీఎం కేసీఆర్ ప్రకటించారని గుర్తు చేశారు.