Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఫిర్యాదు చేసిన తెలంగాణ గిరిజన సంఘం
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
సమ్మక్క-సారాలమ్మ దేవతలతోపాటు గిరిజన సంస్కృతి సాంప్రదాయాలను అవమాన పరిచిన దొంగ డేరా బాబా చినజీయర్‌స్వామిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని తెలంగాణ గిరిజన సంఘం డిమాండ్ చేసింది. గురువారం ఆ సంఘం ఆధ్వర్యంలో చిక్కడపల్లి పోలీస్‌స్టేషన్‌లో కేసు ఫిర్యాదు చేశారు. చిన్నజీయర్‌స్వామి మాట్లాడిన వీడియోలను పరిశీలించి ఎఫ్ఐఆర్
నమోదు చేస్తామని పోలీసులు హామీ ఇచ్చినట్టు చెప్పారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఎం ధర్మనాయక్, ఆర్.శ్రీరామ్‌నాయక్, సహాయ కార్యదర్శి ఎం.బాలునాయక్, నాయకులు కొర్రా భరత్, రమావత్ పాండు, గోపి నాయక్‌తోపాటు ప్రదేశ్ ఎరుకల సంఘం రాష్ట్ర ప్రధానకార్యదర్శి బి.రఘు ఎరుకల తదితరులు పాల్గొన్నారు.