Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మక్తలక్ష్మాపూర్ చెరువులో పడి యువకుడి మృతి
నవతెలంగాణ-పెద్దశంకరంపేట
హౌలీ పండుగ మెదక్ జిల్లాలో విషాదం నింపింది. చెరువులో స్మానానికి వెళ్లిన ఓ యువకుడు నీట మునిగి మృతి చెందిన ఘటన మెదక్‌జిల్లా పెద్దశంకరంపేట మండలం మక్తలక్ష్మాపూర్‌లో జరిగింది. పేట ఎస్ఐ బాలరాజు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన రామాయి సతీష్ (27) హైదరాబాద్‌లోని మియాపూర్‌లో భార్య మాధవితో ఉంటూ ఓ ప్రయివేటు కంపెనీలో సూపర్వైజర్గా పనిచేస్తున్నాడు. అయితే హౌలీ పండుగ నేపథ్యంలో అల్లాదుర్గం మండలం కాయిదంపల్లిలోని అత్తగారింటికి భార్యతో కలిసి గురువారం వచ్చాడు. శుక్రవారం తన స్నేహితులతో కలిసి పండుగను జరుపుకునేందుకు ఒక్కడే మక్తలక్ష్మాపూర్‌కు వచ్చాడు. అనంతరం స్థానిక చెరువులో స్నేహితులతో కలిసి స్నానానికి వెళ్లాడు. ఈ క్రమంలో ప్రమాదవశాత్తు నీట మునిగాడు. స్నేహితులు గమనించి అతడిని కాపాడేందుకు ప్రయత్నించారు. కొనఊపిరితో ఉన్న సతీష్‌ను పేటలోని ప్రయివేటు ఆస్పత్రికి తరలించే ప్రయత్నం చేయగా మార్గమధ్యలోనే మృతి చెందాడు. మృతుని కటుంబీకుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాఫ్తు చేస్తున్నట్టు ఎస్ఐ తెలిపారు.