Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- టీపీసీసీ చీఫ్ రేవంత్ ట్వీట్
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
వనదేవతలు సమ్మక్క,సారలమ్మ తెలంగాణ పౌరుషం, సంస్కృకి ప్రతీక అని పీసీసీ అధ్యక్షులు, ఎంపీ ఎనుముల రేవంత్రెడ్డి అన్నారు. అలాంటి వారిని చినజీయర్ స్వామి అవమానించారని ఆగ్రహం వ్యక్తం చేశారు.ఈమేరకు శుక్రవారం ఆయన ట్వీట్టర్ వేదిక ద్వారా పేర్కొన్నారు. యాదాద్రి ఆగమశాస్త్ర సలహాదారుడిగా ఆయనను వెంటనే తప్పించాలని డిమాండ్ చేశారు. ప్రజల భక్తి, విశ్వాసాలపై దాడి చేసినందుకు ఆయనపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ విషయంలో స్పందించి సరైన చర్యలు తీసుకోవాలని సీఎంవో కార్యాలయాన్ని రేవంత్ కోరారు.