Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కన్వీనర్ కోటాలో 30 సీట్లు..20 సీట్లు మేనేజ్మెంట్
- ఈ విద్యా సంవత్సం నుంచే ప్రారంభం
నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
ఆర్టీసీ తార్నాక ఆస్పత్రిలో నూతనంగా నర్సింగ్ కళాశాలను ఏర్పాటు చేస్తున్నట్టు టీఎస్ఆర్టీసీ చైర్మెన్ బాజిరెడ్డి గోవర్థన్, మేనేజింగ్ డైరెక్టర్ వీసీ సజ్జనార్ తెలిపారు. దీనికి రాష్ట్రానికి చెందిన యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ అనుమతి మంజూరు చేసిందనీ, ఈ విద్యా సంవత్సరం (మార్చి-2022) నుంచే ప్రారంభమవుతుందని శుక్రవారంనాడొక సంయుక్త ప్రకటనలో పేర్కొన్నారు. తార్నాక ఆస్పత్రిలో స్వంత వనరులతో నర్సింగ్ కళాశాలను స్థాపించడానికి రాష్ట్ర ప్రభుత్వం అంగీకరించిందనీ, దానికి అవసరమైన నిబంధనలు, షరతులను క్షుణ్ణంగా పరిశీలించి యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్, కౌన్సిల్ రిజిస్ట్రేషన్, కళాశాలకు అనుమతి ఇవ్వడంపై వారు సంతోషం వ్యక్తం చేశారు. ఏటా 50 సీట్లతో టీఎస్ఆర్టీసీ నర్సింగ్ కళాశాల ఆరంభమవుతుందనీ, 30 సీట్లు కన్వీనర్ కోటాలో, మరో 20 సీట్లు మేనేజ్మెంట్ కోటాలో ఉంటాయని వివరించారు. కళాశాలలో వత్తిపరమైన, అనుభవజ్ఞులైన అధ్యాపకులతో పాటు అత్యాధునిక మౌలిక సదుపాయాలు, విశాలమైన తరగతి గదులు, ప్రయోగశాలల వంటి అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేస్తున్నామన్నారు. తార్నాక ఆస్పత్రిలో వైద్య సేవల్ని అత్యుత్తమంగా తీర్చిదిద్దడం, సంస్థ ఉద్యోగులకు కార్పొరేట్ స్థాయి వైద్యాన్ని అందించడమే లక్ష్యంగా ఆధునీకరణ పనులు కొనసాగుతున్నాయన్నారు. నర్సింగ్ కళాశాల ప్రవేశ వివరాలు, ఇతర సందేహాల కోసం టీఎస్ఆర్టీసీ కాల్ సెంటర్ ఫోన్ నంబర్లు 040-68153333, 040-30102829లో సంప్రదించవచ్చని తెలిపారు. షషష.్రత్ీష.్‌వశ్రీaఅస్త్రaఅa.స్త్రశీఙ.ఱఅ వెబ్‌సైట్‌ను చూడవచ్చనీ, నర్సింగ్ కళాశాల ముఖ్య వైద్యాధికారి, సూపరింటెండెంట్‌ను నేరుగా సంప్రదించవచ్చనీ చెప్పారు.