Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- డీఎంఈకి టీఎంసీఇడబ్ల్యూయూ వినతి
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
ప్రభుత్వాస్పత్రుల్లో పని చేస్తున్న శానిటే,న్, పేషెంట్ కేర్, సెక్యూరిటీ కార్మికుల జీతాలు పెంచాలని తెలంగాణ మెడికల్ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్, వర్కర్స్ యూనియన్ (ఏఐటీయూసీ అనుబంధం) డిమాండ్ చేసింది. ఈ మేరకు ఆ యూనియన్ అధ్యక్షులు ఎండీ, యూసుఫ్, కార్యనిర్వాహక అధ్యక్షురాలు ఎం.లక్ష్మీబాయి, ప్రధాన కార్యదర్శి హసీనా బేగం, ఉప ప్రధాన కార్యదర్శి ఎం.నర్సింహ్మ రాష్ట్ర వైద్య విద్య సంచాలకులు డాక్టర్ కె.రమేశ్ రెడ్డికి వినతిపత్రం సమర్పించారు. కార్మికుల కనీస వేతనాన్ని రూ.21 వేలకు పెంచాలని కోరారు. అనంతరం వారు మాట్లాడుతూ, కార్మికులకు రూ.15,600 జీతం ఇవ్వనున్నట్టు డీఎంఈ యూనియన్‌కు హామీ ఇచ్చినట్టు తెలిపారు. దీనికి సంబంధించి ప్రభుత్వం ఇప్పటికే ఉత్తర్వులు జారీ చేసిందనీ, ఒకట్రెండు నెలల్లో కొత్త కాంట్రాక్టర్లను పిలిచి కార్మికులకు పెరిగిన జీతాలు ఇచ్చే విధంగా చర్యలు తీసుకుంటామని చెప్పినట్టు వెల్లడించారు.