Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఇండియా,క్యూబా సమిట్‌లో మారిన్, జయేష్‌రంజన్
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
క్యూబా, ఇండియా దేశాల మధ్య అగ్రికల్చర్, టూరిజం, బిజినెస్ సంబంధాలను మరింత విస్తరిస్తామని క్యూబా రాయబారి అలెగ్జెండ్రో మారిన్ అన్నారు. శుక్రవారం హైదరాబాద్‌లోని హెచ్ఐసీసీలో నిర్వహించిన ఇండియా, క్యూబా సమిట్ 2022కు ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఐటీ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ జయేష్రంజన్తో కలిసి హైదరాబాద్‌లో క్యూబా ట్రేడ్ సెంటర్‌ను ప్రారంభించారు.అనంతరం మారిన్ మాట్లాడుతూ రెండు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు మెరుగు పరిచేందుకు ట్రేడ్ సెంటర్‌ను ప్రారంభించినట్టు చెప్పారు. భారత రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ క్యూబా పర్యటన తర్వాత రెండు దేశాల మధ్య అన్ని రంగాల్లో సంబంధాలు మెరుగుపడ్డాయని వివరించారు. క్యూబాలో రెనెవబుల్ ఎనర్జీ, ఫార్మా, మెడిసిన్, ఐటీ, ఇండిస్టీయల్ డెవలప్మెంట్ తదితర వ్యాపార వాణిజ్యాలకు భారీగా అవకాశాలు ఉన్నాయని పేర్కొన్నారు. ఫుడ్ ప్రాసెసింగ్ ఇండిస్టీ, షుగర్, సిగార్, కాఫీ ఉత్పత్తులను ఇక్కడ దిగుమతులకు అనుకూలంగా ఉన్నట్టు తెలిపారు. రెండు దేశాల మధ్య వ్యాపార, వాణిజ్య రంగాల్లో అభివద్ధికి హైదరాబాద్ వేదికగా అవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఐటీశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ జయేష్‌రంజన్ మాట్లాడుతూ రాష్ట్రంలో ఐటీ సెక్టార్ గణనీయంగా అభివద్ధి చెందిందన్నారు. ఫుడ్ ప్రాసెసింగ్ సెక్టార్‌ను విస్తరించేందుకు అవకాశాలున్నాయని చెప్పారు. ట్రేడ్ పాలసీ పెట్టుబడులకు అనుకూలమని వివరించారు. ఈ సందర్భంగా లాటిన్ అమెరికా కరేబియన్ ఫెడరేషన్(ఎల్ఏసీఎఫ్ఐ) తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ల రాష్ట్రాల క్యూబా ట్రేడ్ కమిషనర్‌గా డాక్టర్ మూర్తి దేవరబొట్లకు నియామక పత్రాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో క్యూబా మిషన్ డిప్యూటీ చీఫ్ అబెల్ డెస్పజైన్, డాక్టర్ మూర్తి, ఏంఈఏ హెడ్ దాసరి బాలయ్య, ఐపీఎస్ అధికారి శ్రీధర్‌రావు, కోఆర్డినేటర్ తస్మీన్ , వ్యాపార, వాణిజ్య, అగ్రికల్చర్, ఫుడ్ ఇండిస్టీ, ఇండిస్టీయల్ రంగాల ప్రముఖులు పాల్గొన్నారు.