Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాలడుగు భాస్కర్
- 28, 29 తేదీల్లో దేశవ్యాప్త సమ్మె వాల్ పోస్టర్ ఆవిష్కరణ
నవతెలంగాణ-బాలానగర్
ఈనెల 28, 29 తేదీల్లో జరిగే దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెలో పాల్గొని విజయవంతం చేద్దామని సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాలడుగు భాస్కర్ పిలుపునిచ్చారు. తెలంగాణ స్టేట్ యునైటెడ్ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ యూనియన్ (సీఐటీ) గ్రేటర్ హైదరాబాద్ ముఖ్యనాయకుల సమావేశం నగర సీఐటీయూ కార్యాలయంలో శుక్రవారం నిర్వహించారు. ఈ సమావేశానికి సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాలడుగు భాస్కర్, రాష్ట్ర అధ్యక్షులు వి.కుమార చారి, సీఐటీయూ నగర కార్యదర్శి కె.ఈశ్వర రావు, టీఎస్‌యూఈఈయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వి.గోవర్ధన్ సమ్మె వాల్‌పోస్టర్‌ను ఆవిష్కరించారు. అనంతరం పాలడుగు భాస్కర్ మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న కార్మిక ప్రజావ్యతిరేక విధానాలను నిరసిస్తూ దేశవ్యాప్త సమ్మెలోపాల్గొని విజయవంతం చెయ్యాలని కోరారు. ఆర్టిజన్ కార్మికులకు కన్వర్షన్ ఇచ్చి ఎపిఎస్ఇబి సర్వీసు రూల్స్ అమలు చేయాలని, 1999 తరువాత నియమితులైన విద్యుత్ ఉద్యోగులందరికీ జి.పి.ఎఫ్ అమలు చేయాలని, సంస్థలో పనిచేస్తున్న 6500 మంది పీస్‌రేట్ కార్మికులకు కనీస వేతనాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు మురళి, ప్రసాద్ రాజు, రాము, రవీందర్, శంకర్ నాయక్, రాజేశ్వర్, కార్మికులు పాల్గొన్నారు.