Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట యోధురాలు, సీపీఐ(ఎం) సీనియర్ నేత మల్లు స్వరాజ్యం ఆరోగ్యం విషమించింది. వయో భారంతోపాటు ఊపిరితిత్తుల సమస్యతో దీర్ఘకాలంగా బాధపడుతున్న ఆమె ఈనెల రెండో తేదీ నుంచి హైదరాబాద్‌లోని బంజారాహిల్స్ కేర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ఆమెకు ఐసీయూలో వెంటిలేటర్‌పై డాక్టర్లు చికిత్స అందిస్తున్నారు. అయితే శుక్రవారం ఆమె ఆరోగ్యం విషమంగా ఉందంటూ డాక్టర్లు చెప్పారని కుటుంబ సభ్యులు మల్లు లక్ష్మి నవతెలంగాణకు వివరించారు.