Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
నేషనల్ మీన్స్ కమ్ మెరిట్ స్కాలర్షిప్ (ఎన్ఎంఎంఎస్) రాతపరీక్ష ఈనెల 27వ తేదీన ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు జరగనుంది. ఈ మేరకు ప్రభుత్వ పరీక్షల విభాగం సంచాలకులు ఎ కృష్ణారావు శనివారం ఒక ప్రకటన విడుదల చేశారు. దరఖాస్తు చేసిన విద్యార్థులు http//bse.telangana.gov.in వెబ్సైట్ను సందర్శించి సోమవారం నుంచి హాల్టికెట్లను డౌన్లోడ్ చేసుకునేందుకు అవకాశం కల్పించామని సూచించారు.