Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : స్పెల్ బీ కాంటెస్ట్‌లో నారాయణ విద్యార్థులు అడుగడుగునా ఆకట్టుకున్నారు. నారాయణ స్కూల్స్ మరియు క్విజ్ బిజ్ ఆధ్వర్యంలో అతి పెద్ద స్పెల్ బీ కాంటెస్ట్ హైదరాబాద్, హైటెక్ సిటీలోని శిల్పకళావేదికలో అట్టహాసంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ప్రఖ్యాత క్విజ్ వ్యాఖ్యాత వినరు ముడాలియర్ వ్యాఖ్యాతగా వ్యవహరించారు. ప్రోగ్రామ్ అనంతరం విజేతలుగా నిలిచిన విద్యార్థులను ప్రత్యేకంగా అభినందించారు. విజేతలుగా నిలిచిన విద్యార్థులకు ప్రశంసా పత్రాలతో పాటు ట్రోఫీలు, నగదు బహుమతులు అందించారు. ఈ కాంటెస్టు వివిధ నారాయణ స్కూల్స్ నుంచి 10000 వేల మందికి పైగా విద్యార్థులు పాల్గొన్నారు. విద్యార్థులను ప్రిలిమనరీ రౌండ్, బ్రాంచ్ స్థాయి, క్లస్టర్ స్థాయిలుగా విభజించి ఒక్కొక్కరికి వేర్వేరుగా 4 దశల్లో పోటీ నిర్వహించారు. పోటీలోని చివరి అంకం ర్యాంపిడ్ ఫైర్ పద్ధతిలో సాగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా విచ్చేసిన ఉస్మానియా యూనివర్సిటీ సైన్స్ ఫ్యాకల్టీ డీన్ ప్రొఫెసర్ బాలకష్ణ పాల్గొన్నారు. ఇలాంటి కార్యక్రమాల్లో పాల్గొనడానికి ఆసక్తి చూపిన విద్యార్థులను అభినందించారు. ఇలాంటి అత్యద్భుత కార్యక్రమాలు నిర్వహించటం ద్వారా విద్యార్థుల్లో బహుముఖ ప్రజ్ఞతో పాటు వారి సర్వతోముఖాభివృద్ధికి ఎంతగానో దోహదం చేస్తాయని తెలిపారు. అలాగే తెలుగు చలన చిత్ర పరిశ్రమలో దర్శకులుగా వెలుగొందుతున్న అనిల్ రావిపూడి, ప్రముఖ నటుడు శ్రవణ్ అతిధులుగా హాజరై విద్యార్థులను ఉత్సాహపరిచారు. ఈ సందర్భంగా నారాయణ విద్యాసంస్థల మేనేజింగ్ డైరెక్టర్ శరణి నారాయణ మాట్లాడుతూ పోటీ ప్రపంచంలో విజేతగా నిలవడానికి ఇంగ్లీషు ఎంతో ముఖ్యం అన్నారు. ఇలాంటి కార్యక్రమాలు విద్యార్థుల్లో సృజనాత్మక శక్తిని వెలికితీస్తాయన్నారు. రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయస్థాయిలో ఏ పోటీ పరీక్ష నిర్వహించిన నారాయణ విద్యార్థులు ముందువరుసలో ఉండటం జరుగుతోందన్నారు. ఇలాంటి వినూత్న కార్యక్రమాలకు నారాయణ వేదిక కావటం ఎంతో ఆనందంగా ఈ కార్యక్రమానికి వ్యాఖ్యాతగా వ్యవహరించిన ఉందని వినరు ముడాలియర్ అన్నారు. ప్రోత్సహిస్తున్న నారాయణ గ్రూప్‌కు ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమానికి నారాయణ మేనేజింగ్ డైరెక్టర్ డా|| పి. సింధూర నారాయణ, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కె.పునీత్, డైరెక్టర్ రవితేజ హాజరైన విద్యార్థులకు మరియు తల్లిదండ్రులకు శుభాకాంక్షలు తెలిపారు.