Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- యాదాద్రి ప్రారంభోత్సవం తర్వాత కీలక నిర్ణయాలు
- ఫామ్‌హౌస్‌లో సీఎస్, మంత్రులతో కేసీఆర్ రహస్య మీటింగ్
- పీకే రిపోర్ట్‌పై చర్చ.. ముందస్తుకు పోవాలా? వద్దా.. మీమాంస..
- 21న టీఆర్ఎస్ శాసనసభ పక్ష సమావేశంలో కార్యాచరణ!
నవతెలంగాణ-గజ్వేల్/మర్కుక్
త్వరలోనే సీఎం పదవి కేటీఆర్‌కు దక్కనుందా?.. ముందస్తు ఎన్నికలకు వెళ్లేలోగా కేటీఆర్‌ను సీఎం చేయాలని కేసీఆర్ ఆలోచనలో ఉన్నార?.. అనే గుసగుసలకు శనివారం రోజు సీఎం వ్యవసాయ క్షేత్రంలో జరిగిన అత్యవసర రహస్య మీటింగ్ అవుననే సమాధానాన్ని ఇస్తుంది. సీఎస్, మంత్రులతో అత్యవసరంగా సమావేశం పెట్టడం పట్ల సర్వత్రా ఆసక్తి నెలకొన్నది. యాదాద్రి దేవాలయం ప్రారంభోత్సవం తర్వాత రాష్ట్రంలో పలు కీలక నిర్ణయాలు జరగనున్నట్టు తెలుస్తోంది.
సిద్దిపేట జిల్లా మర్కుక్ మండంలోని ఎర్రవల్లిలోని సీఎం ఫామ్‌హౌస్‌లో సీఎస్ సోమేష్‌కుమార్, మంత్రులు హరీశ్‌రావు, తలసాని శ్రీనివాస్ యాదవ్, ప్రశాంత్‌రెడ్డి, శ్రీనివాస్‌గౌడ్,జగదీష్‌రెడ్డి,సబితా ఇంద్రారెడ్డి, కొప్పుల ఈశ్వర్, గంగుల,ఇంద్రకరణ్‌రెడ్డి,ఎమ్మెల్సీ కవిత,ఉన్నతాధికారులతో సీఎం కేసీఆర్ అత్యవ సర సమావేశాన్ని ఏర్పాటు చేశారు.ఈనెలలో యాదాద్రి దేవాలయ ప్రారంభోత్స వం తర్వాత తీసుకోనున్న పలు కీలక నిర్ణయాలపై సీఎం చర్చించా రని సమాచారం.ముందుస్తు ఎన్నికలకు పోయేలోపు కేటీఆర్‌ను ముఖ్యమంత్రిని చేయాలనే ఆలోచనలో సీఎం కేసీఆర్ ఉన్నారని.. ఇదే ప్రధాన ఎజెండాగా సమావేశం జరిగినట్టు తెలుస్తోంది. కేటీఆర్‌ను సీఎం చేయాలని ఏడాది నుంచి కుటుంబ సభ్యుల నుంచి ఒత్తిడి రావడం.. పలువురు మంత్రులు ఈ నిర్ణయానికి సుముఖంగా ఉండటంతో..కేటీఆర్‌ను ముఖ్యమంత్రిని చేయాలని కేసీఆర్ ఆలోచిస్తున్నట్టు సమాచారం. అదేవిధంగా పీకే రిపోర్టుపై కూడా చర్చించినట్టు తెలుస్తోంది. టీఆర్ఎస్ ప్రభుత్వానికి పార్టీ అంతా అనుకూలంగా లేదని.. దీన్ని మార్చుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందని సీఎం సూచించినట్టు సమాచారం. 119 నియోజకవర్గాల్లో మంత్రులు, ఎమ్మెల్యేల తీరు టీఆర్ఎస్కు పెద్దగా అనుకూలంగా కనిపించడం లేదని పీకే రిపోర్టు తేల్చి చెప్పడంతో..ముందస్తు ఎన్ని కలకు వెళ్లాలని సీఎం ఆలోచిస్తున్నట్టు ఊహాగానాలు వస్తున్నాయి. అంతేకాకుండా కేంద్ర ప్రభుత్వం,బీజేపీ నాయకుల తీరును మరింత ఎండగట్టాలని ఓ కార్యాచరణ రూపొందించినట్టు సమాచారం.ఈనెల 21న నిర్వహించే టీఆర్ఎస్ శాసనసభ పక్ష సమావేశంలో దీనిపై ఓ నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ముఖ్యమంత్రి మార్పు కూడా ఈ సమావేశంలో వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది.