Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
తెలంగాణ రాష్ట్ర మీడియా అకాడమీ, తెలంగాణ ఎస్సీ కులాల సహకార సంస్ద ఆధ్వర్యంలో ఈనెల 26, 27వ తేదీల్లో రెండు రోజుల పాటు దళిత జర్నలిస్టులకు ప్రత్యేక శిక్షణా తరగతులు నిర్వహించనున్నట్టు తెలంగాణ మీడియా అకాడమీ చైర్మెన్ అల్లం నారాయణ తెలిపారు. శనివారం హైదరాబాద్లోని ప్రెస్అకాడమీ కార్యాలయంలో కార్యదర్శి వెంకటేశ్వర్రావుతో కలిసి మీడియాతో మాట్లాడారు. ఆసక్తి గల జర్నలిస్టులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. దీనికి సంబంధించి ఇతర వివరాలను అకాడమీ కార్యాలయంలో సంప్రదించాలని కోరారు. కోవిడ్ సోకిన జర్నలిస్టులకు రూ. 10 వేల తగ్గకుండా అకాడమీ తరపును సహాయం అందించినట్టు చెప్పారు. ఇప్పటివరకు తొమ్మిది జిల్లాల్లో విలేకర్ల శిక్షణా తరగతుల ునిర్వహించామనీ చెప్పారు. షెడ్యూల్ కులాల జర్నలిస్టులకు ప్రత్యేక శిక్షణ తరగతులు చేపట్టనున్నట్టు ప్రకటించారు. హైదరాబాద్లోని జవహర్లాల్ నెహ్రు యూనివర్సిటీ ఆడిటోరియంలో శిక్షణ ఇస్తామని చెప్పారు. ఈ తరగతులను మంత్రి కొప్పుల ఈశ్వర్ ప్రారంభిస్తారని వివరించారు. ఉదయం 10:30 గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు శిక్షణ కొనసాగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో మీడియా అకాడమీ అధికారులు ఏ.వనజ పాల్గొన్నారు.