Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రాష్ట్ర్ర అధ్యక్షులు రేవంత్ రెడ్డి
- భూసంస్కరణల కోసం సర్వోదయ సంకల్ప పాదయాత్ర
నవతెలంగాణ-తూప్రాన్ రూరల్ (మనోహరాబాద్)
పేదలకు అసైన్డ్ పట్టాలు పంచినా, ఇందిరమ్మ ఇండ్లనిచ్చినా.. మహాత్మా గాంధీ స్ఫూర్తితో కాంగ్రెస్ పార్టీలో హయాంలోనే పేదల సంరక్షణ జరిగిందని టీపీసీసీ రాష్ట్ర అధ్యక్షులు రేవంత్‌రెడ్డి అన్నారు. టీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తరువాత సీఎం కేసీఆర్ భూసంస్కరణలను తుంగలో తొక్కారని, పెట్టుబడిదారుల కోసం ప్రాజెక్టుల నిర్మాణం పేరుతో పేదల భూములకు తూతూ మంత్రంగా నష్టపరిహారమిచ్చి గుంజుకుంటున్నారని విమర్శించారు. అలాంటి వాటిపై కాంగ్రెస్ పార్టీ పాదయాత్ర ద్వారా ప్రజలకు వివరిస్తుందని తెలిపారు. భూ సంస్కరణల కోసం భూదాన్ పోచంపల్లి నుంచి మహారాష్ట్రలోని సేవాగ్రామ్ వరకు 600 కిలో మీటర్ల మేర రాజీవ్‌గాంధీ సంఘటన స్థల్ మాజీ ఎంపీ మీనాక్షి నటరాజన్ చేపట్టిన సర్వోదయ సంకల్ప పాదయాత్ర శనివారం మెదక్ జిల్లా మనోహరాబాద్‌కు చేరుకుంది. ఈ సందర్భంగా పాదయాత్రకు రేవంత్ రెడ్డి సంఘీభావం తెలిపారు. అనంతరం మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ధరణి పోర్టల్‌తో రాష్ట్రంలో లక్షలాది మంది ప్రజలు వీధిపాలయ్యారన్నారు. అంతేకాక ధరణితో కబ్జాదారులు పేట్రేగిపోత ుండటంతో జంట నగరాల్లో తుపాకీతూటాలు పేలుతున్నాయని తెలిపారు. ప్రభుత్వం వెంటనే ధరణి పోర్టల్‌పై సమీక్షించి పేదలకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.