Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- దళితబంధు యూనిట్లను వేగవంతంగా గ్రౌండింగ్ చేయాలి :
- ఎస్పీ కార్పొరేషన్ చైర్మెన్ బండ శ్రీనివాస్, కలెక్టర్ ఆర్వి కర్ణన్
- హుజూరాబాద్‌లో దళితబంధుపై సమీక్ష
నవతెలంగాణ-హుజురాబాద్
కరీంనగర్ జిల్లా హుజూరా బాద్ నియోజకవర్గంలో దళితబంధు కార్యక్రమంలో పౌల్ట్రీ యూనిట్లకు ప్రాధాన్యత ఇవ్వాలని ఎస్సీ కార్పొరేషన్ చైర్మెన్ బండ శ్రీనివాస్, కలెక్టర్ ఆర్వి.కర్ణన్ సూచించారు. హుజూరాబాద్ క్యాంపులోని ఆర్డీవో కార్యాలయంలో దళితబంధు యూనిట్ల గ్రౌండింగ్‌పై శనివారం అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఈ నెల 31లోగా యూనిట్లను గ్రౌండింగ్ చేయాలని, బృందాలుగా ఏర్పడి లబ్దిదారులు ఎంపిక చేసుకున్న 489 గూడ్స్, ప్యాసింజర్ వాహనాలను వేగవంతంగా గ్రౌండింగ్ చేయాలన్నారు. మినీ డైయిరీని ఎంపిక చేసుకున్న 550 మంది లబ్దిదారుల యూనిట్లను, 78 గ్రూప్ యూనిట్లను వెంటనే గ్రౌండింగ్ చేయాలని అధికారులను ఆదేశించారు. ఇతర లబ్దిదారులు ఎంపిక చేసుకున్న సెంట్రింగ్ యూనిట్లు, టెంట్ హౌస్‌లు, హౌమ్ నీడ్స్ యూనిట్లను కూడా నమోదు చేయాలని సూచించారు. గూడ్స్ వాహనాలు తీసుకునే లబ్దిదారులకు లైసెన్సులు బ్యాడ్జీ నెంబర్లు ఉండేలా సరిచూసుకోవాలని తెలిపారు. ప్రతి మున్సిపల్, ఎంపీడీవో కార్యాలయంలో క్లస్టర్ల వారీగా దళితబంధు లబ్దిదారులకు సంబంధించిన దరఖాస్తుల వివరాలు నమోదు కోసం ప్రత్యేక రిజిస్టర్లో నమోదు చేయాలని సూచించారు. వ్యక్తిగత ప్రొఫైల్ ఏర్పాటు చేయాలన్నారు. ఒరిజినల్ దరఖాస్తులను ఎస్సీ కార్పొరేషన్ కార్యాలయానికి పంపించాలని, జీరాక్స్ ప్రతిని కార్యాలయంలో ఉంచాలన్నారు. ట్రాన్స్పోర్ట్ అధికారులు, యూనిట్ గ్రౌండింగ్ చేసే అధికారులు సమన్వయంతో పని చేసి యూనిట్లను వేగవంతంగా అయ్యేలా చూడాలని కలెక్టర్ అన్నారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ గరిమ అగర్వాల్, అసిస్టెంట్ కలెక్టర్ మయాంక్ మిట్టల్, జడ్పీ సీఈఓ ప్రియాంక, ఎస్సీ కార్పొరేషన్ ఈడి సురేష్, నెహ్రూ యువ కేంద్ర కోఆర్డినేటర్ రాంబాబు, లీడ్ బ్యాంక్ మేనేజర్ లక్ష్మణ్, ఉప రవాణా శాఖ కమిషనర్ చంద్రశేఖర్‌గౌడ్, డీఆర్డీవో శ్రీలత, బ్యాంకర్లు, క్లస్టర్ అధికారులు, యూనిట్ల గ్రౌండింగ్ అధికారులు, ఎంపీడీవోలు, మున్సిపల్ కమిషనర్లు పాల్గొన్నారు.