Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పాడిపంటలతో రైతులు సంతోషంగా ఉండాలి:
- సహస్ర చండీయాగంలో స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి
నవతెలంగాణ-హవేళిఘనపూర్
తెలంగాణ రాష్ట్రం సస్యశ్యామలమై.. పాడిపంటలతో రైతులు సంతోషంగా ఉండాలని శాసనసభ స్పీకర్ పోచారం శ్రీనివాస్‌రెడ్డి ఆకాంక్షించారు. ఎమ్మెల్సీ శేరి సుభాష్‌రెడ్డి- లక్ష్మీ దంపతులు మెదక్ జిల్లా హవేళీఘనపూర్ మండలంలోని కూచనపల్లిలో గల వారి వ్యవసాయ క్షేత్రంలో శనివారం నిర్వహించిన సహస్ర చండీ యాగంలో స్పీకర్ పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. మాధవానంద స్వామితోపాటు 150మంది ఋత్వికుల ఆధ్వర్యంలో చండీయాగం నిర్వహిం చారు. సహస్ర చండీ యాగంలో పాల్గొన్న స్పీకర్‌ను ఎమ్మెల్సీ సత్కరించారు. పూజారులు స్పీకర్‌కు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లా డీసీసీబీ చైర్మెన్ భాస్కర్ రెడ్డి, హవేలి ఘణాపూర్ మండల ఎంపీపీ శేరి నారాయణరెడ్డి, నిజాంపేట జెడ్పీటీసీ పంజా విజరు కుమార్, స్థానిక సర్పంచ్ దేవాగౌడ్, ఉప సర్పంచ్ బయ్యన్న ఉన్నారు.
అభిషేకంలో పాల్గొన్న సురభి వాణి..
సహస్ర చండీ యాగంలో ఎమ్మెల్సీ సురభి వాణి పాల్గొన్నారు. ఋత్వికులు మంగళ వాయిద్యాలు, వేద మంత్రోచ్ఛారణల మధ్య ఆమెకు ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం రంగంపేట పీఠాధిపతి శ్రీ శ్రీ శ్రీ మాధవానంద సరస్వతిని దర్శించుకుని ఆశీస్సులు పొందారు. అనంతరం వాణిని సుభాష్ రెడ్డి కుటుంబ సభ్యులు సన్మానించారు.