Authorization
Mon Jan 19, 2015 06:51 pm
తెలంగాణ సాయుధ పోరాట రథం...మల్లు స్వరాజ్యం...
ఆమె ఒక ఉద్యమ ఉప్పెన.. నిరసన గళం.. సాయుధ పోరాట రథం..భూమి, భుక్తి, విముక్తి కోసం 16ఏండ్లకే తుపాకి పట్టి బరిలోకి దిగిన ఫ్రీడమ్ఫైటర్. సమసమాజ స్థాపన కోసం ఎర్రదండులో కదిలిన ప్రజా పతాక. 91ఏండ్ల వయసులోనూ ఉద్యమ స్ఫూర్తిని రగిలించిన విప్లవశిఖరం.. 'సామ్రాజ్యవాదాన్ని కూకటి వేళ్లతో పెకిలించేందుకు వెళ్దాం పదా' అంటే ఉన్నఫలంగా భుజంపై గొడ్డలి పెట్టుకుని వచ్చేంత విప్లవ చైతన్యం.ఎన్నో పోరాటాలతో పాలకులకు ముచ్చెమటలు పట్టించిన ఆమె అనారోగ్యంతో కన్నుమూసిందన్న వార్తను జీర్ణించుకో లేకపోతోంది ఈ సమాజం..సోషలిజం ఆకాంక్షను నెరవేర్చేందుకు మళ్లీ పుట్టాలని కోరుకుంటోంది నేటితరం...
మల్లు స్వరాజ్యం...ఈ పేరుకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సుధీర్ఘమైన చరిత్ర. పేరుకు తగినట్టు గానే స్వరాజ్యాన్ని స్థాపించేందుకు బ్రిటీషోల్లతో అలుపెరుగని పోరాటం చేసిన స్వాతంత్య్ర సమరయోధురాలు. 1931లో ఉద్యమాల పురిటిగడ్డ, త్యాగాలకు చిరునామా అయిన నల్లగొండ జిల్లా తుంగతుర్తి మండలం కొత్త గూడెంలో జన్మించారు. ఆమె భర్త కమ్యూనిస్టు నేత, మల్లు వెంకట నర్సింహారెడ్డి కొన్నేండ్ల కిందటే మరణించారు.భారతదేశంలో సోషలిజం రావడానికి అవసరమైన విప్లవ కార్యచర ణను రూపొందించి ముందుకు సాగుతున్న సీపీఐ(ఎం)పార్టీయే వారికి ఆస్తి,పాస్తి అన్నీ. ఆంధ్ర రాష్ట్రంలో పార్టీ ఏర్పడిన మొదటి నుంచి ఆమె ఉద్యమ నిర్మాణంలో ఉన్నారు.13 ఏండ్లకే పల్లెపల్లె తిరిగి తన పాటలతో ప్రజల్ని చైతన్యపరిచారు. రైౖతు, కార్మిక పోరాటాలు, స్త్రీ ఉద్యమాలు నిర్మించి పార్టీ ఎదుగుదలకు తనవంతు కృషిచేశారు. అప్పటి నల ్లగొండ, ఖమ్మంతో పాటు కరీంనగర్, వరంగల్, ఆదిలాబాద్ జిల్లాల్లో గిరిజనులకు అండగా నిలిచి వారి గుండెల్లో చెరగని ముద్ర వేసుకున్నారు.తన వారసత్వానికి పంచింది కూడా కమ్యూనిజమే. ఉద్యమ రక్తాన్ని కొడు కులే కాదు కోడలూ పంచుకున్నారు. చిన్న కుమారుడు సూర్యపేటకు పార్టీ జిల్లా కార్యదర్శిగా పని చేస్తున్నారు. ఆయన భార్య మల్లు లక్ష్మి పార్టీరాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు.ప్రస్తుతం ఐద్వా తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ఉండి మహిళలపై హింస, అఘాయిత్యాలకు వ్యతిరేకంగా ఉద్యమిస్తున్నారు. మల్లు స్వరాజ్యం భూస్వామ్య కుటు ంబంలో పుట్టినప్పటికీ పేదలంటే ప్రాణం. ప్రజాప్రతినిధిగా ఉన్నా ఆమె నిత్యం ప్రజల మధ్యే ఉండేవారు. ఎప్పు డూ వారి కష్టసుఖాల్లో తోడుండేవారు. వారికేదైనా సమస్య వస్తే ఎంత దూరమైనా వెళ్లి పరిష్కరించేవారు. అందు కనేమో ఆమె ముఖంలో తేజంతో పాటు రౌద్రం కూడా కనిపిస్తాయని కార్యకర్తలం టుంటారు. కర్తవ్య సాధనలో ఎన్నో ఆటుపోట్లను చవిచూశారు. ఉద్యమ తీవ్రత పెరిగేకొద్దీ ఆదే స్థాయిలో ఆమెపై నిర్భందం కూడా ఎక్కు వైంది. చాలా రోజులు కుటుంబానికి దూరంగా ఉండి పోరాడారు. జైలు జీవితమూ గడిపారు. ప్రజా వ్యతిరేక విధా నాలు అవలంభిస్తున్న పాల కులను అసెంబ్లీలో గట్టిగా నిలదీశారు. ప్రజల పక్షాన బలమైనవాణిని వినిపించారు.
- నమిలికొండ అజరుకుమార్.