Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- వరిధాన్యం కొనుగోళ్లపై ప్రత్యక్ష ఆందోళనలు
- అదేరోజు ఢిల్లీకి సీఎం,మంత్రుల బృందం..
నవతెలంగాణ-హైదరాబాద్బ్యూరో
టీఆర్ఎస్ శాసనసభాపక్ష సమావేశాన్ని ఈనెల 21 నిర్వహించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయించారు. ఆరోజు ఉదయం 11.30 గంటలకు తెలంగాణ భవన్లో ఈ సమావేశం జరుగుతుంది. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, జిల్లా అధ్యక్షులు, జడ్పీ చైర్మెన్లు, డీసీసీబీ, డీసీఎమ్ఎస్ల అధ్యక్షులు, రైతుబంధు సమితుల జిల్లా అధ్యక్షులు తప్పనిసరిగా ఈ సమావేశానికి హాజరుకావాలని ఆదేశించారు. రాష్ట్రంలో యాసంగి వరి ధాన్యాన్ని కేంద్రప్రభుత్వం కచ్చితంగా కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ క్షేత్రస్థాయిలో ధర్నాలు, ఆందోళనలు, నిరసన కార్యక్రమాలకు ఈ సమావేశంలో రూపకల్పన చేయనున్నారు. ఈ సమావేశం ముగియగానే ముఖ్యమంత్రి, మంత్రుల బందం అదే రోజు ఢిల్లీ బయలుదేరి వెళ్తారు. ధాన్యం కొనుగోళ్ళ మీద కేంద్ర మంత్రులను, అవసరమైతే ప్రధానిని కలిసి డిమాండ్ చేయాలని నిర్ణయించారు. రాష్ట్రంలో జరిగే ఆందోళన కార్యక్రమాలకు అనుగుణంగా లోక్సభ, రాజ్యసభలో టిఆర్ఎస్ ఎంపీలు నిరసన కార్యక్రమాలు చేపట్టాలని నిర్ణయించారు. పంజాబ్ రాష్ట్రానికి చెందిన వరి ధాన్యాన్ని 100 శాతం కేంద్ర ప్రభుత్వం సేకరిస్తున్నందున, తెలంగాణ వరి ధాన్యాన్ని కూడా పంజాబ్ తరహాలో 100 శాతం ఎఫ్సీఐ ద్వారా సేకరించాలని డిమాండ్ చేస్తూ ఈ ఆందోళన కార్యక్రమాలు కొనసాగించనున్నట్లు సీఎం కేసీఆర్ ఫాంహౌస్లో జరిగిన పార్టీ సీనియర్ నేతల సమావేశంలో తెలిపారు. తెలంగాణ రైతుల జీవన్మరణ సమస్య అయిన వరి ధాన్యం కొనుగోలుపై ఉధతమైన పోరాటాలకు టీఆర్ఎస్ పార్టీ సిద్ధం అవుతున్నదనీ, అందువల్ల ఆహ్వానితులందరూ తప్పనిసరిగా సమావేశానికి హాజరుకావాలని చెప్పారు.
పెట్టుబడులే లక్ష్యం అమెరికా వెళ్లిన మంత్రి కేటీఆర్ బృందం
రాష్ట్రానికి మరిన్ని పెట్టుబడులు తీసుకువచ్చే ప్రయత్నం లో భాగంగా తెలంగాణ ఐటి, పరిశ్రమల శాఖ మంత్రి కే తారకరామారావు ఆ శాఖ ఉన్నతాధికారుల బందంతో కలిసి అమెరికా పర్యటనకు వెళ్లారు. శనివారం ఉదయం హైదరాబాద్ నుంచి బయలుదేరిన మంత్రి బృందం అమెరికాలోని లాస్ ఏంజిల్స్, శాన్ డియాగో, సానో హౌజే, బోస్టన్, న్యూయార్క్ వంటి నగరాల్లో పర్యటించి పలు కంపెనీల అధిపతులు, సీనియర్ ప్రతినిధి
బందాలతో సమావేశమవుతారు. వారం రోజులపాటు సాగే ఈ పర్యటనలో ప్రపంచంలోని అత్యంత ప్రతిష్ఠాత్మకమైన ఐటి, ఎలక్ట్రానిక్స్, ఫుడ్ ప్రాసెసింగ్, లైఫ్ సైన్సెస్, ఫార్మా రంగాల కంపెనీలతో సమావేశమవుతారు. పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి జయేష్ రంజన్, ఐటీ శాఖకు చెందిన పలు విభాగాల డైరెక్టర్లు ఈ పర్యటనలో పాల్గొంటున్నారు.