Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 3వేల కోళ్లు మృత్యువాత
నవతెలంగాణ-నెక్కొండ
అంతుచిక్కని వైరస్ సోకి మూడు వేల కోళ్లు మృత్యువాత పడిన సంఘటన వరంగల్ జిల్లా నెక్కొండ మండలం మడిపల్లి గ్రామపంచాయితీ పరిధిలో ఆదివారం చోటుచేసుకుంది. బాధితుడు తెలిపిన వివరాల ప్రకారం.. మడిపల్లికి చెందిన మురళి మూడేండ్లుగా ఉపాధి నిమిత్తం తన సొంత వ్యవసాయ భూమిలో పౌల్ట్రీ ఫామ్ ఏర్పాటు చేసుకున్నాడు. ఇటీవల ఓ ప్రముఖ కంపెనీ నుంచి 11,300 పిల్లలను తీసుకొచ్చాడు. రెండు రోజులుగా అంతుచిక్కని వైరస్‌తో ఇప్పటికే 3వేల కోళ్లు మృత్యువాతపడ్డాయి. మెడిసిన్ వేసినప్పటికీ ఇంకా కోళ్లు చనిపోతున్నాయి. దాంతో లక్షల్లో నష్టం వాటిల్లుతోంది. కోళ్లపై కంపెనీ వారికి బీమా ఉన్నప్పటికీ, పౌల్ట్రీ ఫామ్ నడిపే యజమానులకు బీమా లేకపోవడం శోచనీయం. తనను ఆదుకోవాలని బాధిత యువ రైతు కోరుతున్నాడు.