Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- బీజేపీ సెంట్రల్ జిల్లా అధ్యక్షుడి పిలుపు
అరబర్పేట: ప్రజావ్యతిరేకత ప్రభుత్వంపై నాయకులు కార్యకర్తలు పోరాడాలని బీజేపీ సెంట్రల్ జిల్లా అధ్యక్షులు ఎన్ గౌతం రావు అన్నారు. ఈ మేరకు ఆదివారం అంబర్ పేట డివిజన్ పరిధిలోని పటేల్ నగర్ లో ఏర్పాటుచేసిన సమావేశంలో అంబర్ పేట డివిజన్ చెందిన సీనియర్ నాయకులు బోనం వీరబాబు కీ బీజేపీ సెంట్రల్ జిల్లా కార్యవర్గ సభ్యులు గా జిల్లా అధ్యక్షులు ఏన్ గౌతం రావు నియామక పత్రం అందజేశారు. ఈ సందర్భంగా బోనం వీరబాబు మాట్లాడుతూ నాపై నమ్మకం ఉంచిన... కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి జాతీయ బీసీ అధ్యక్షులు డాక్టర్ లక్ష్మణ్ సెంటర్ జిల్లా అధ్యక్షులు గౌతం రావు, గద్వాల్ జిల్లా ఇన్చార్జి బి వెంకట రెడ్డి, డివిజన్ అధ్యక్షులు నాగభూషణం చారి సీనియర్ నాయకులు గంధమాల ఆనంద్ గౌడ్ బిక్షపతి యశ్వంత్ తదితరులకూ, సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేశారు నాపై నమ్మకం ఉంచిన బాధ్యతను నెరవేరుస్తానని గౌతంరావు అన్నారు.