Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- విద్యార్థుల కోసం కంట్రోల్ రూం ఏర్పాటు : ఇంటర్ బోర్డు
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
రాష్ట్రంలో ఇంటర్మీడియెట్ విద్యార్థులకు బుధవారం నుంచి ప్రాక్టికల్ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. ఈ మేరకు ఇంటర్ బోర్డు కార్యదర్శి సయ్యద్ ఒమర్ జలీల్ సోమవారం ఒక ప్రకటన విడుదల చేశారు. బుధవారం నుంచి వచ్చేనెల ఎనిమిదో తేదీ వరకు జూనియర్ కాలేజీల్లో ప్రాక్టికల్ పరీక్షలు జరుగుతాయని తెలిపారు. ఉదయం ఎనిమిది నుంచి రాత్రి ఎనిమిది గంటల వరకు ఇది అందుబాటులో ఉంటుందని పేర్కొన్నారు. ఏమైనా సందేహాలుంటే విద్యార్థులు, ప్రిన్సిపాళ్లు దీన్ని వినియోగించుకోవాలని సూచించారు. టెలిఫోన్ నెంబర్ 040-24600110, ఈమెయిల్ helpdesk-ie@telangana.gov.inను సంప్రదించాలని కోరారు.