Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీఎస్ఆర్టీసీ)లో ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ల (ఈడీ)ను వేర్వేరు ప్రాంతాలకు బదిలీ చేశారు. ఈ మేరకు సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ వీసీ సజ్జనార్ ఉత్తర్వులు జారీ చేశారు. ప్రస్తుతం ఈడీలు అందరూ బస్‌భవన్ కేంద్రంగా, హైదరాబాద్‌లోనే విధులు నిర్వహిస్తున్నారు. సుదీర్ఘకాలంగా ఒకే చోట పనిచేస్తున్నారు. వారిలోని వ్యక్తిగత శక్తి సామర్థ్యాలను అంచనా వేశాకే, వారిని ఇతర బాధ్యతల్లోకి బదిలీ చేసినట్టు బస్‌భవన్ వర్గాలు తెలిపాయి. ఆపరేషన్స్ అండ్ అడ్మినిస్ట్రేషన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా ఉన్న యాదగిరిని గ్రేటర్ హైదరాబాద్ జోన్‌కూ, అక్కడ ఈడీగా పనిచేస్తున్న వెంకటేశ్వర్లును కరీంనగర్ జోన్‌కు బదిలీ చేశారు. రెవెన్యూ అండ్ ఐటీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా పనిచేస్తున్న పురుషోత్తం నాయక్‌ను హైదరాబాద్ జోన్‌కు బదిలీ చేశారు. ఈడీ ఆపరేషన్స్‌గా మునిశేఖర్‌ను నియమించారు. ఈ ఉత్తర్వులు తక్షణం అమల్లోకి వస్తాయని ఎమ్డీ పేర్కొన్నారు.