Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- జాతీయ ఎస్సీ కమిషన్ వైస్ చైర్మెన్‌కు తెలంగాణ మదాసి కురువ/మదారి కురువ ఎస్సి సంక్షేమ సంఘం నేత వినతి
హైదరాబాద్ : మదాసి కురువ కులస్తులకు తప్పుడు కురువ బీసీ కులపత్రాలు ఇచ్చిన వారికి తక్షణమే ఎస్సి మదాసి కురువ కుల పత్రాలు ఇచ్చే విధంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి ఆదేశాలివ్వాలని జాతీయ ఎస్సి కమిషన్ వైస్ చైర్మెన్ అరుణ్ హల్దార్‌ను తెలంగాణ మదాసి కురువ/మదారి కురువ ఎస్సి సంక్షేమ సంఘం రాష్ట్ర ఆధ్యక్షుడు కురువ విజరుకుమార్ కోరారు. మంగళవారం ఢిల్లీలోని కమిషన్ ఆఫీస్‌లో మాజీ జాతీయ ఎస్సి కమిషన్ సభ్యుడు రాములు, జాతీయ ఎస్సి ఎస్టీ ఎంప్లాయిమెంట్ కాన్ఫెడరేషన్ అధ్యక్షుడు మహేశ్వర్ రాజ్‌లతో అరుణ్ హల్దార్ కలిసినట్టు విజరుకుమార్ ఒక ప్రకటనలో తెలిపారు. వారితో పాటు పోతుల మల్లేష్ ఉన్నారు. ఈ సందర్భంగా వైస్ చైర్మెన్ అరుణ్ హల్దార్ మాట్లాడుతూ త్వరలోనే తెలం గాణ సీఎస్‌కు నోటీసు జారీ చేసి గతంలో ఎస్సి కమిషన్, రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాలను అమలు చేసి వారికి కుల పత్రాలు ఇచ్చే విధంగా న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు.