Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
విశ్వకర్మల అభివృద్ధి, సంక్షేమానికి రాష్ట్ర బడ్జెట్లో కేవలం మూడు కోట్లు మాత్రమే కేటాయించి రాష్ట్ర ప్రభుత్వం వారికి తీవ్ర అన్యాయం చేసిందని వృత్తి సంఘాల రాష్ట్ర నాయకులు లెల్లెల బాలకృష్ణ తెలిపారు. మంగళవారం హైదరాబాద్‌లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో కూరెళ్ల నర్సింహాచారి అధ్యక్షతన నిర్వహించిన విశ్వకర్మల రాష్ట్ర కమిటి సమావేశంలో ఆయన మాట్లాడారు. ఇప్పటికైనా బడ్జెట్‌ను సవరించి కనీసం రూ.200కోట్లు కేటాయించాలని డిమాండ్ చేశారు. విశ్వ కర్మ వృత్తిదారుల అభివృద్ధి పట్ల ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని విమర్శించారు. ప్రభుత్వం వృత్తిదారులకు ఉచిత విద్యుత్‌తో పాటు ప్రమాద బీమా అందించాలని డిమాండ్ చేశారు. సంఘం రాష్ట్ర నూతన ప్రధాన కార్యదర్శిగా రాళ్లబండి కుమారస్వామిని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. రాష్ట్రసహాయ కార్యదర్శి గుంటోజు భీష్మచారి. గన్నోజుశేఖర్చారి, సుంకోజు.యాదగిరి చారి.గుంటోజు శ్రీనివాస చారి.వెంకటాచారి, దశరథచారి పాల్గొన్నారు.