Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
తనకు రక్షణ సిబ్బంది అంటే ఎనలేని గౌరవమని రాష్ట్ర గవర్నర్ డాక్టర్ తమిళిసై సౌందర రాజన్ తెలిపారు. మంగళవారం రాజ్ భవన్లో నేషనల్ డిఫెన్స్ కాలేజీకి (ఎన్డీసీ) చెందిన 15 మంది ట్రైనీ అధికారులు గవర్నర్‌ను మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. జాతీయ భద్రత, వ్యూహాత్మక అధ్యయనంలో భాగంగా ఎన్డీసీ ఎయిర్ వైస్ మార్షల్ తేజ్ బీర్ సింగ్ నేతృత్వంలో వారు ఆమెతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా తమిళిసై మాట్లాడుతూ మన సాయుధ దళాల తెగింపు, త్యాగాలు గొప్పవన్నారు. వారి వల్లే మనం సంరక్షింపబడుతున్నామనీ, సంతోషంగా ఉండగలుగుతున్నామని తెలిపారు.
ఈ సందర్భంగా ఆమె రాజ్‌భవన్ పనితీరును వారికి వివరించారు. సమావేశంలో గవర్నర్ కార్యదర్శి కె.సురేంద్ర మోహన్ పాల్గొన్నారు.