Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఏప్రిల్ 24న నిర్వహణ
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
రాష్ట్రంలో మోడల్ స్కూళ్లలో వచ్చే విద్యాసంవత్సరంలో ఆరు నుంచి పదో తరగతి వరకు ప్రవేశాల కోసం పరీక్ష నిర్వహణ తేదీ వాయిదా పడింది. ప్రవేశ పరీక్ష వచ్చేనెల 17కు బదులుగా 24వ తేదీన నిర్వహించనున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది. ఈ మేరకు మోడల్ స్కూళ్ల ప్రాజెక్టు డైరెక్టర్ జి ఉషారాణి మంగళవారం ఒక ప్రకటన విడుదల చేశారు. ఆరో తరగతిలో ప్రవేశాలకు ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పరీక్ష ఉంటుందని తెలిపారు.